తెలుగు ఇండస్ట్రీలో వరస సినిమాలతో దూసుకుపోతున్న కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి విజయం అందుకున్నాడు కిరణ్. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఈయన చేస్తున్న మరో సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది ఇప్పుడు. శతాధిక చిత్ర దర్శకుడు, అజాతశత్రువు అయిన కీర్తిశేషులు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi) నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కార్తిక్ శంకర్ (Karthik Shankar) ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కుటుంబ సభ్యుడిగా పేరు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. తెలుగు సినిమా దర్శక లెజెండ్ కోడి రామకృష్ణ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baga Kavalsinavadini) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కోడి రామకృష్ణ గారు చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియేటర్‌కి పిక్నిక్గా వెళ్ళి చూసేవారు. ఇప్పటికీ టీవిలో ఆయన చిత్రాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ అంతా కూర్చిని చూస్తుంటారు. అలా తెలుగు ప్రేక్షకులకి ఆయన బాగా కావాల్సినవాడిగా వారి కుటుంబసభ్యుడిగా మారిపోయారు.
Nenu meku baga kavalsinavadini ??#NenuMeekuBaagaKavalsinavaadini ?#KA5 #NMBK ?
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 23, 2022
A #Manisharma Musical ?@kodidivya @sanjanaa_anand @siddharth2121 @kodi_divya8 @kaarthik_shankar @rajknalli @poetbb @nareshreddy_mule @bharat_rongali @eluruseenu @laharimusic @housefull pic.twitter.com/CbCMSX3JnK
అలాంటి తెలుగు దర్శకుడి పెద్ద కుమార్తె దివ్య దీప్తి, అలాగే మంచి చిత్రాలు చేస్తూ ప్రతి ప్రేక్షకుడికి బాగా కావాల్సిన వాడిలా కిరణ్ అబ్బవరం కలిసిపోవడం, ఈ చిత్ర కథ కూడా అన్ని ఎమోషన్స్‌తో రావడంతో ఈ చిత్రానికి నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే టైటిల్ ఖరారు చేసారు. కోడి రామకృష్ణ గారి దివ్య ఆశిస్సులతో టైటిల్‌ని ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి సంభందించిన మొదటి లుక్ కూడా విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్షకులు ఒకే సారిగా మాస్ కమర్షియల్ లుక్‌లో అందర్ని ఆకట్టుకున్నాడు. టాలీవుడ్లో వున్న కమర్షియల్ హీరోల సరసన చేరేలా ఈ లుక్ వుండటం విశేషం. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiran abbavaram, Telugu Cinema, Tollywood