నాగబాబు నువ్వో కోన్‌కిస్కా గొట్టం.. బండ బూతులు తిట్టిన కుర్ర దర్శకుడు..

నాగబాబు (Twitter/Nagababu)

Naga Babu Vijay Chowdary Tripuraneni: నాగబాబు ఈ మధ్యే బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నందమూరి అభిమానులతో పాటు చాలా మంది కూడా నాగబాబు చేసిన కామెంట్స్ తప్పు బట్టారు.

  • Share this:
నాగబాబు ఈ మధ్యే బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నందమూరి అభిమానులతో పాటు చాలా మంది కూడా నాగబాబు చేసిన కామెంట్స్ తప్పు బట్టారు. అక్కడ బాలయ్యను ఎందుకు పిలవలేదనే టాపిక్ శాంతియుతంగా ఆలోచించుకోవాలి కానీ నువ్వేం కింగ్ కాదు.. జస్ట్ హీరో అంతే అంటూ నాగబాబు మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. అసలు బాలయ్యను అనేంత స్థాయి నీకెక్కడుంది అంటూ నాగబాబును అభిమానులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు విజయ్ చౌదరి నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
నాగబాబు, బాలకృష్ణ (nagababu balakrishna)
నాగబాబు, బాలకృష్ణ (nagababu balakrishna)

నువ్వెంత నీ బతుకెంత.. నువ్వా మా బాలయ్య గురించి మాట్లాడేది.. అంటూ రెచ్చిపోయాడు ఈ కుర్ర దర్శకుడు. ఈయన కవ్వింత అనే సినిమా చేసాడు. ఇప్పుడు బాలయ్యపై నాగబాబు చేసిన కామెంట్స్ బాగా వ్యక్తిగతంగా తీసుకున్న ఈయన సంచలన కామెంట్స్ చేసాడు. బండ బూతులు తిట్టాడు. ఇండస్ట్రీలో సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడివి నువ్వు.. ఇండస్ట్రీలో కారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరిని లైన్లో నిలబెడితే వెనక నుంచి ముందు వచ్చేది నువ్వే.. రోజా తర్వాత అంత పెద్ద యాంకర్ నువ్వు.. నువ్వా మా బాలయ్య గురించి మాట్లాడేది అంటూ రెచ్చిపోయాడు ఈయన.

నువ్వు కానీ చిరంజీవి తమ్ముడివి కాకపోతే నీ బతుకేంటి.. పవన్ కళ్యాణ్ అన్నవి కాకపోతే నిన్నెవడు పట్టించుకుంటాడు.. అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించాడు విజయ్ చౌదరి. బాలయ్యను పిలవకుండా మీటింగ్స్ జరిపేంత దమ్ము నీకుందా.. మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. కింగ్ కాదు.. ఇండస్ట్రీ ఏం మీ ఫ్యామిలీ సొత్తు కాదు.. బాలయ్యను మీటింగులకు పిలవాల్సిన భాద్యత మీది కాదా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు విజయ్ చౌదరి. మీలా లోపల ఒకటి.. బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే మనస్తత్వం కాదు బాలయ్యది.. లోపల ఏముంటే అది బయటికి అడిగేస్తాడు అంటూ రెచ్చిపోయాడు ఈయన.

నువ్వేమన్నా కింగా.. మీ అన్నేమైనా కింగా.. లేదంటే మీ తమ్ముడేమైనా కింగా.. అంటూ ఫైర్ అయ్యాడు విజయ్ చౌదరి. మీ కాపు వర్గంలో మరో స్టార్ హీరో ఎందుకు రాలేదు.. మీరు రానివ్వలేదు.. తొక్కేసారు.. మీరొక్కరే ఉండాలని తొక్కేసారంటూ రెచ్చిపోయాడు ఈ కుర్ర దర్శకుడు. మీరు పెట్టిన పీఆర్పీ పార్టీకి ఫండ్స్ ఇచ్చిన మీ వర్గం నాయకులతో పాటు ఎంతమంది నాశనం అయిపోయారు.. అలాంటి మీరా బాలయ్య గురించి మాట్లాడేది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు విజయ్. అసలు ఇండస్ట్రీలో ఉన్న కమిటీలు ఏంటి.. దాంట్లో ఉన్న మెంబెర్స్ ఎవరు.. గట్టిగా నాలుగు సినిమాలు కూడా తీయని వాడు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. రెండు సినిమాలు నిర్మించని వాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. వాళ్లదో కమిటీ అంటూ మండి పడ్డాడు ఈయన. నీ యిష్టమొచ్చినట్లు ఇక్కడ కూడా నోరు పారేసుకుంటామంటే ఎవ్వడూ చూస్తూ ఊరుకోడు.. కంట్రోల్‌లో పెట్టుకుని మాట్లాడు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు విజయ్ చౌదరి. ఈయనకు త్రిపురనేని మహారధి కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం ఆయన ఇంటిపేరు మాత్రమే.
Published by:Praveen Kumar Vadla
First published: