HOME »NEWS »MOVIE »young director prashanth kumar writes a open letter to rajamouli sr

రాజమౌళికి యువ దర్శకుడి బహిరంగ లేఖ : నీ సినిమాలన్నీ కాపీలే..

రాజమౌళికి యువ దర్శకుడి బహిరంగ లేఖ : నీ సినిమాలన్నీ కాపీలే..
తనతోపాటు తన కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా జ్వరం వచ్చిందని, కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కొద్దిసేపటి క్రితం రాజమౌళి ట్వీట్ చేశారు. డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు.

రాజమౌళికి ఓ యువ దర్శకుడు బహిరంగ లేఖ రాస్తూ నీ సినిమాల్లో చాలా సీన్స్ వేరే సినిమాల్లోంచి లేపేసినవే.. అంటూ సంచనల వ్యాఖ్యలు చేశాడు.

  • Share this:
    రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఆర్ ఆర్ ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని వంటి పరభాషా నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఇంటి వద్దనే ఉన్న రాజమౌళి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాదానంగా ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్ పారాసైట్ తనకు బోర్ కొట్టిందని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ యువ దర్శకుడు ఆస్కార్ అవార్డ్ పొందిన సినిమాను పబ్లిక్‌గా బోర్ కొట్టిందంటవా.. ఓ దర్శకుడిగా ఒరిజినల్ సినిమాను ఎలా అలా అంటావు.. అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖలో ఆ యువ దర్శకుడు రాజమౌళిని ఆడేసుకున్నాడు. నువ్వు సై సినిమాలో ఓ సీన్ సీన్ వేరే సినిమా నుండి లేపావు.. అయినా నీ మీద గౌరవంతో ఎవరూ బయటకు మాట్లాడలేంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. పారాసైట్ చిత్రం వాస్తవికతకి అద్దం పట్టేలా ఉంది. ప్రత్యేకించి భాషా అడ్డంకులను అధిగమించేంత శక్తివంతమైనదిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా బాలేదని రాజమౌళి అనడం ఏ మాత్రం బాగోలేదంటూ.. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు పారాసైట్‌ని ఎంతగానో ప్రశింసించారు.. కానీ బాహుబలిని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని.. చూడలేదని తన లేఖలో పేర్కొన్నాడు. ఆయన ఇంకా తన లేఖలో రాస్తూ.. సైతో పాటు మీరు తీసిన చాలా చిత్రాలు కూడా కాపీలే అంటూ తన లేఖలో పేర్కోన్నాడు. ఈ యువ దర్శకుడి పేరు ప్రశాంత్ కుమార్. ఈయన 2019లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా మిఠాయి అనే సినిమాను తెరకెక్కించాడు.

    ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ను టార్గెట్ చేసుకుని వివిధ రకాల మీమ్స్‌తో ట్విట్టర్‌లో రాజమౌళి అభిమానులు, నెటిజన్స్ తీవ్రంగా కామెంట్స్ పెడుతున్నారు. ఓ సినిమా తీసి మాట్లాడుతున్నావని.. ఏవరి వాక్ స్వతంత్య్రం వారికి ఉంటుందంటూ ఓ సినిమాపై రాజమౌళి తన అభిప్రాయం చెప్పాడని దీంట్లో తప్పేముందని ప్రశాంత్‌కు కౌంటర్ ఇస్తున్నారు.



    Published by:Suresh Rachamalla
    First published:April 24, 2020, 12:39 IST

    टॉप स्टोरीज