నగలకే రూ. కోటి... దీపికా- రణ్‌వీర్ పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు...

రూ. 20 లక్షల విలువైన మంగళసూత్రం... రూ. 80 లక్షల విలువైన ఆభరణాలు... రెండు సార్లు పెళ్లి, రెండు సార్లు రిసెప్షన్...

news18-telugu
Updated: November 5, 2018, 5:09 PM IST
నగలకే రూ. కోటి... దీపికా- రణ్‌వీర్ పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు...
కుటుంబ సభ్యులతో దీపికా పదుకునే (twitter)
  • Share this:
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ పెళ్లి సందడి షురూ అయ్యింది. నవంబర్ 14, 15 తేదీల్లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించిన హాట్ కపుల్... వివాహ వేడుకలను మొదలెట్టేశారు. బెంగళూరులోని దీపికా నివాసంలో జరిగిన పూజా కార్యక్రమానికి చెందిన ఫోటోలను ఆమె స్టైలిస్ట్ షలీనా నథాలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారి పెళ్లి షాపింగ్ కూడా పూర్తి చేసేశారట రణ్‌వీర్, దీపికా పదుకొనే... ఈ ఆన్‌స్క్రీన్ ‘పద్మావతి’ని పెళ్లి కునేందుకు ప్రత్యేకంగా మంగళసూత్రం తయారుచేయించాడు ఆన్‌స్క్రీన్ ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’. తాళి కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు రణ్‌వీర్.

దీపిక రణ్‌వీర్ సింగ్


దీపికా పదుకునే కూడా తన కాబోయే మొగుడి కోసం ఏకంగా 80 లక్షల విలువైన నగలు, ఆభరణాలు చేయించిదట. నగల ఖర్చే కోటి రూపాయలకు పైగా అయ్యిందని బాలీవుడ్ సమాచారం.

దీపిక పదుకొనె ఇంట మొదలైన పెళ్లి సందడి


నవంబర్ 14న ఇటలీలో కొంకణి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకునే దీప్‌వీర్ జంట... 15న సింధి పద్దతితో వివాహం చేసుకోనుంది. పెళ్లి మాత్రమే కాకుండా రిసెప్షన్‌కు రెండు సార్లు చేసుకోబోతున్నారు రణ్‌వీర్, దీపికా.

షారుక్ ఖాన్ దీపిక పదుకొనే
బెంగళూరులో జరిగే మొదటి రిసెప్షన్‌కు బంధు, మిత్రులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించి... ముంబయిలో సినీ, రాజకీయ, క్రీడారంగాలకు చెందిన వారందరి మధ్య గ్రాండ్ రిసెప్షన్ జరుపుకోవాలని అనుకుంటున్నారు.

దీప్‌వీర్


రణ్‌వీర్ సింగ్‌, దీపికా పదుకునే కలిసి నటించిన ‘రామ్‌లీల’, ‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టాయి.

దీపికా, రణ్‌వీర్ సింగ్


‘పద్మావత్’ సినిమాలో రాణీ పద్మావతి పాత్రలో దీపికా పదుకునే నటించగా, విలన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ జీవించేశాడు. ఈ సినిమాలో మాత్రం వీళ్లిద్దరు జంటగా నటించలేదు. మరోవైపు ఈ  మూవీలో వీళ్లిద్దరి మధ్య  ఎలాంటి సన్నివేశాలు లేకపోవడం విశేషం.
Published by: Ramu Chinthakindhi
First published: November 5, 2018, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading