Kareena Kapoor-Anil Kapoor: కరీనా కపూర్ తన దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు అనిల్ కపూర్. ఈ మాటలు విన్న కరీనా కూడా ఒక్కసారిగా షాక్‌కి గురైంది. నేను డబ్బులు తీసుకోవడం ఏంటని బిక్కమొహం వేసుకుంది. అయితే ఆ తరువాత అనిల్ దానికి వివరణ ఇవ్వగా.. కరీనాతో పాటు అక్కడున్న అందరికీ నవ్వు తెప్పించింది. ఇదంతా ఓ షోలో జరిగింది. కరీనా కపూర్ వ్యాఖ్యతగా వాట్ విమెన్ వాంట్ అనే షో చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పాల్గొన్నారు. షోలో భాగంగా అనిల్ కపూర్‌ని పలు ప్రశ్నలు అడిగారు కరీనా. అందులో భాగంగా హాలీవుడ్లో తమకు సమానంగా హీరోయిన్లు రెమ్యునరేషన్ తీసుకునేలా హీరోలు మద్దతును ఇస్తారు. అలానే బాలీవుడ్లో ఏ హీరో అయినా చేయగలడా అని కరీనా ప్రశ్నించింది. దానికి స్పందించిన అనిల్.. అవును నువ్వు నా దగ్గర నుంచి ఎక్కువ మనీని తీసుకున్నావు అని ఒక సంఘటనను గుర్తు చేశారు.
వీర్ ది వెడ్డింగ్‌కి నేను ఒక నిర్మాతను. ఆ సినిమా కోసం చర్చలు జరుగుతున్నప్పుడు.. మిగిలిన నిర్మాతలు నాకు ఫోన్ చేశారు. సర్ కరీనా హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని వారు చెప్పారు. వెంటనే నేను కరీనాకు ఎంత కావాలో అంత ఇవ్వండి అని చెప్పా. ఆ తరువాత వాళ్లు కాల్ చేసి కరీనా కన్ఫర్మ్ అయినట్లు చెప్పారు అని అనిల్ కపూర్ అప్పటి సంఘటనను ఇచ్చారు. అంతేకాదు తన సినిమాల్లో తన కంటే హీరోయిన్లే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపారు. చాలా మంది హీరోయిన్లు నా కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నాను. నేను సంతోషంగా ఆ సినిమాల్లో నటించా అని అనిల్ వివరించారు.
దానికి కరీనా.. అవును మేము అడ్డుగోడలను కూలగొడుతాము. కానీ మీలా చాలా మంది లేరు కదా అని అన్నారు. కాగా ఈ జంట బెవాఫా, తషాన్ చిత్రాల్లో కలిసి నటించారు. ఇక తక్త్లోనూ ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటం, ప్రస్తుతం కరీనా గర్భవతి కావడంతో.. తక్త్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టనుంది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్, అలియా భట్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ కూడా భాగం కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Kapoor, Kareena Kapoor