Kangana Ranaut : నువ్వు మరాఠివే కాదు.. నీకెందుకు చెప్పాలి క్షమాపణ.. : కంగనా

Kangana Ranaut : ఇటీవల కంగనా రనౌత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండి పడుతున్నారు.

news18-telugu
Updated: September 7, 2020, 11:11 AM IST
Kangana Ranaut : నువ్వు మరాఠివే కాదు.. నీకెందుకు చెప్పాలి క్షమాపణ.. : కంగనా
కంగనా రనౌత్ Photo : Twitter
  • Share this:
Kangana Ranaut : కంగనా రనౌత్.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే.. బాలీవుడ్‌‌లో నెపోటిజం, నియంత పోకడలపై ఒంటరిపోరాటం చేస్తోన్న కంగనా రనౌత్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో బాలీవుడ్ ప్రముఖులపై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది. అంతేకాదు సుశాంత్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించట్లేదని, ప్రభుత్వం కొందరిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కంగనా రనౌత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అధికార శివసేన నేతలు మండి పడుతున్నారు. అహ్మదాబాద్‌ను పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చగల ధైర్యం కంగనా రనౌత్‌కు ఉందా అని రావత్‌ ప్రశ్నించారు.



కంగనా ట్వీట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా ఇక్కడ నివసిస్తూ, ఇక్కడ పనిచేస్తూ, ముంబై, మహారాష్ట్ర, మరాఠా ప్రజల గురించి చెడుగా మాట్లాడితే, అటువంటి వారే మొదట క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను క్షమాపణ చెప్పే విషయాన్ని ఆలోచిస్తాను’’అని అన్నారు. దీనికి స్పందించిన కంగనా.. అసలు సంజయ్ రావత్ మరాఠి కాదని.. ఆయన తన నుండి క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందని పేర్కోంది. ఏమాత్రం మహిళల్నీ గౌరవించని రావత్ నీతులు మాట్లాడడమేంటని ప్రశ్నించింది. సెప్టెంబర్ 9న ముంబై వస్తూన్ననని ఒకవేళా నన్ను చంపాలనీ అనుకుంటే చంపోచ్చని ఓ వీడియోను తన సోషల్ మీడియాలో విడుదల చేసింది కంగనా.
Published by: Suresh Rachamalla
First published: September 7, 2020, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading