జాతీయ నటుడు కమల్‌హాసన్(Kamal Haasan), వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ శంకర్(Shankar)కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ఇండియన్-2(Indian-2)కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈసినిమాలో ఓ స్పోర్ట్స్ స్టార్ తండ్రి గెస్ట్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ చెన్నై(Chennai)లో జరుగుతోంది. ఆ విశేషాలను ఆయనే స్వయంగా సోషల్ మీడియా(Social media) ద్వారా పంచుకున్నారు.ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh)తండ్రి యోగరాజ్ సింగ్ (Yogaraj Singh)భారతీయుడు-2లో యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనే సస్పెన్స్ మాత్రం లీక్ చేయలేదు. కమలహాసన్ మూవీ కోసం యూపీ ఫాదర్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా ఉంది.
క్రేజీ క్యారెక్టర్ ...
రెండు దశాబ్దాల క్రితమే ప్యాన్ ఇండియా, వరల్డ్ క్లాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వస్తున్న మూవీ ఇండియన్-2. భారతీయుడికి సీక్వెల్‌గా వస్తున్న ఈసినిమాలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ యాక్ట్ చేస్తున్నారు. మూవీలో ఈయన పాత్ర కీ రోల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ చెన్నైలో మంగళవారం ప్రారంభమైంది. షూటింగ్లో భాగంగానే యోగరాజ్సింగ్పై ఆయనపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. షూట్లో పాల్గొనే ముందు మేకప్ వేసుకుంటున్న ఫోటోని షేర్ చేశారు యోగరాజ్ సింగ్. ఇండియన్-2 సినిమా కోసం లయన్ ఆఫ్ పంజాబ్ రెడీ అవుతున్నాడంటూ కామెంట్‌ని పోస్ట్ చేశారు.
View this post on Instagram
పంజాబ్ స్టార్ ..
యోగరాజ్ సింగ్ కూడా కొడుకు యువరాజ్‌సింగ్ తరహాలోనే మంచి క్రికెటర్. ఇండియా జట్టులో ఆడారు. ఇప్పుడున్న క్రికెటర్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌తో ఎంతో ఫ్రెండ్లీగా గడుపుతారు యోగరాజ్సింగ్. స్టార్ క్రికెటర్ తండ్రి యోగరాజ్ పంజాబీ సినిమాల్లో యాక్ట్ చేశారు. నెక్స్ట్ ప్యాన్ ఇండియా మూవీలో కనిపించబోతున్నారు.
ఎప్పుడు పూర్తయ్యేనో..
ఇప్పటికే అనేక సార్లు షూటింగ్లో ప్రమాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఇండియన్-2 ఎప్పటిలోగా షూటింగ్ పూర్తవుతుందో చూడాలి. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో ..సీక్వెల్ కూడా అంతే సక్సెస్ అవుతుందనే హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian 2, Tollywood, Yuvaraj singh