ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత.. నివాళులు అర్పించిన సినీ ఇండస్ట్రీ..

నిన్నటి తరానికి చెందిన ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ నిమ్మి ముంబైలోని ఓ హాస్పిటల్‌లో కన్నుమూసారు. ఆమె నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు 88 ఏళ్లు. 

news18-telugu
Updated: March 26, 2020, 9:08 AM IST
ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత.. నివాళులు అర్పించిన సినీ ఇండస్ట్రీ..
అలనాటి నటి ‘నిమ్మి’ కన్నుమూత (Twitter/Photo)
  • Share this:
నిన్నటి తరానికి చెందిన ఫేమస్ బాలీవుడ్ నటి నిమ్మి ముంబైలోని ఓ హాస్పిటల్‌లో కన్నుమూసారు. ఆమె నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు 88 ఏళ్లు.  ఆమె ముంబైలోని సర్లా నర్సింగ్ హోమ్‌లో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నిమ్మీ విషయానికొస్తే.. రాజ్‌కపూర్ తెరకెక్కించిన ‘బర్సాత్’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆమె అసలు పేరు నవాబ్ బానో. ఆయనే ఆమె పేరునవాబ్ బానో పేరును నిమ్మిగా మార్చాడు. ‘బర్సాత్’ సినిమాతో నటిగా ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో గ్రామీణ యువతిగా ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు. ఆ తర్వాత ఆమె ఎక్కువగా ఇలాంటి గ్రామీణ యువతి పాత్రల్లోనే ప్రేక్షకులకు చేరువైంది. నటిగా నిమ్మికి ‘ఆన్’, ‘ఉడాన్ ఖటోలా’, భాయ్ భాయ్’ , కుందన్’ మేరే మెహబూబ్ తదితర చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 1949లో ప్రారంభమైన ఆమె 1965 వరకు నటించింది. 1963లో  ఆమె చివరగా ‘లవ్ అండ్ గాడ్’ సినిమా చేసింది. ఆ సినిమా మాత్రం 23 ఏళ్ల తర్వాత 1986లో విడుదలైంది. ఆమె మృతికి రిషీకపూర్, మహేష్ భట్ సహా పలువురు బాలీవుడ్ నటీనటులు తమ సం తాపం ప్రకటించారు.First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు