హోమ్ /వార్తలు /సినిమా /

సౌందర్యతో తన ఎఫైర్ నిజమేనంటున్న జగపతిబాబు..

సౌందర్యతో తన ఎఫైర్ నిజమేనంటున్న జగపతిబాబు..

సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)

సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)

Jagapathi Babu Soundarya: ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేసారు. మిలీనియం మొదట్లో కూడా సర్దుకుపోదాం రండి లాంటి సినిమాలలో జగపతిబాబు, సౌందర్య జోడీకి మంచి మార్కులు పడ్డాయి.

వినడానికి కూడా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేసారు. మిలీనియం మొదట్లో కూడా సర్దుకుపోదాం రండి లాంటి సినిమాలలో జగపతిబాబు, సౌందర్య జోడీకి మంచి మార్కులు పడ్డాయి. దానికి ముందు కూడా మూడు ముక్కలాట, అల్లరి ప్రేమికుడు, భలే బుల్లోడు ఇలా చాలా సినిమాలు కలిసి నటించారు ఈ జోడీ. తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు, వెంకటేష్ తర్వాత ఆ స్థాయిలో లేడీస్ పాలోయింగ్ సంపాదించుకున్న హీరో జగపతిబాబు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే చాలు సంచలనమే. అదే సమయంలో ఈయనకు ప్లే బాయ్ ఇమేజ్ కూడా బాగానే ఉండేది.

సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)
సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)

అందులో తప్పేం లేదని.. తాను సంపాదించిందంతా అలాగే తగలేసానని ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు కూడా చెప్పాడు. అయితే తనకు సౌందర్యకు మధ్య ఏదో ఉందని.. ఎఫైర్ నడిచిందని చాలా మంది అనుకుంటారని.. అది తన వరకు కూడా వచ్చిందని చెప్పాడు ఈ సీనియర్ హీరో. ఇప్పుడు దీనిపై కొన్ని సంచలన నిజాలు చెప్పాడు ఈయన. సౌందర్యతో తనకు ఎఫైర్ ఉందని చెప్పాడు ఈయన. అవును అప్పట్లో సౌందర్యతో నాకు అఫైర్ ఉండేదని ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు ఈయన. అయితే అది అంతా అనుకుంటున్నట్లు లైంగిక సంబంధం కాదని చెప్పాడు జేబీ.

సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)
సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)

సౌందర్య అన్నయ్య అమర్ కూడా తనకు బాగా క్లోజ్ అని చెప్పాడు జగపతిబాబు. రెండు కుటుంబాలు తరుచుగా కలుసుకుంటూ ఉండేవని.. సౌందర్య ఇంటికి తాను.. తన ఇంటికి సౌందర్య కూడా తరుచూ వస్తుండేదని చెప్పాడు ఈయన. అందుకే జనం కూడా తప్పుగా అనుకున్నారని.. కానీ సౌందర్య అలాంటిది కాదని చెప్పాడు ఈయన. అంతేకాదు.. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా జనం తప్పుగా మాట్లాడుకునే వాళ్లని.. తాను కూడా అలాంటి కామెంట్స్ విన్నానని చెప్పాడు ఈయన. కానీ దాన్ని తానెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. ఓ కాంప్లిమెంట్‌గానే తీసుకున్నానని చెప్పాడు జగపతిబాబు.

సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)
సౌందర్యతో తన బంధం గురించి చెప్పిన జగపతిబాబు (jagapathi babu soundarya affair)

తాము ఇద్దరం దాచి పెట్టాల్సినంత తప్పు ఏం చేయలేదని.. మంచి స్నేహితులుగానే ఎప్పుడూ ఉన్నామని చెప్పాడు జేబీ. అందుకే తమపై వచ్చే రూమర్లను తాను కానీ.. సౌందర్య కానీ ఎప్పుడూ పట్టించుకోలేదని చెప్పాడు ఈయన. ఎఫైర్ అంటే లైంగిక సంబంధం కలిగి ఉండటమని ఆలోచిస్తారు కానీ తమ మధ్య మంచి అనుబంధం ఉండేదని చెప్పాడు. అందుకే సౌందర్యకు, తనకు ఈ రకమైన ఎఫైర్ ఉందని చెప్పాడు జేబీ. స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే కేవలం 31 సంవత్సరాల వయసులో హెలికాప్టర్ ప్రమాదంలో 2004, ఎప్రిల్‌లో చనిపోయింది సౌందర్య.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jagapathi babu, Soundarya, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు