హోమ్ /వార్తలు /సినిమా /

ఏందిరా ఈ పంచాయితీ.. తెరపైకి డిఫరెంట్ కాన్సెప్ట్

ఏందిరా ఈ పంచాయితీ.. తెరపైకి డిఫరెంట్ కాన్సెప్ట్

Endira E Panchayiti (Photo Twitter)

Endira E Panchayiti (Photo Twitter)

Yendira Ee Panchayithi: ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తోన్న కొత్త సినిమా ఏందిరా ఈ పంచాయితీ. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు, రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో వచ్చే సినిమాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం మేకర్లంతా కూడా తమ తమ మూలాల్లోకి వెళ్లి కథలు రాసుకుంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని తెరపై చూపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆడియెన్స్ సైతం అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. కమర్షియల్‌గా విజయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఏందిరా ఈ పంచాయితీ' (Yendira Ee Panchayithi) అనే సినిమా కూడా రాబోతోంది.

ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తోన్న ఈ మూవీతో గంగాధర టీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంతో భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది.

ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఊరి వాతావరణం, అందులో ఉండే గొడవలు, రకరకాల మనుషుల గురించి ప్రతీకగా చూపించినట్టు అనిపిస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. అంటే ఒక ఊర్లో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు