హోమ్ /వార్తలు /సినిమా /

‘ఏడు చేపల కథ’ సినిమా సెకండ్ టీజర్.. వామ్మో బూతుకు పరాకాష్ట..

‘ఏడు చేపల కథ’ సినిమా సెకండ్ టీజర్.. వామ్మో బూతుకు పరాకాష్ట..

ఏడు చేపల కథ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. తొలి టీజర్ విడుదలయ్యేంత వరకు ఈ సినిమా ఒకటి వస్తుందని ఎవరికీ తెలియదు కానీ వచ్చిన తర్వాత మాత్రం రచ్చ చేసింది. ఏకంగా కోటి వ్యూస్ అందుకుంది టీజర్.

ఏడు చేపల కథ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. తొలి టీజర్ విడుదలయ్యేంత వరకు ఈ సినిమా ఒకటి వస్తుందని ఎవరికీ తెలియదు కానీ వచ్చిన తర్వాత మాత్రం రచ్చ చేసింది. ఏకంగా కోటి వ్యూస్ అందుకుంది టీజర్. ఇక ఇప్పుడు రెండో టీజర్ వచ్చేసింది. ఇది తొలి టీజర్‌ను మించిన రచ్చతో వచ్చింది. అసలు తెలుగు సినిమా ఇప్పుడు ఎటు వైపు వెళ్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. అడ‌ల్ట్ కామెడీలు ప‌క్క ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన‌పుడు చూసి బాపురే ఏంటిది.. వీళ్లకు అస‌లు క‌థ‌తో సంబంధం లేదా అనుకునేవాళ్లు.

కానీ ఇప్పుడు ఇలాంటి క‌థ‌లు మ‌న ఇండ‌స్ట్రీలోనే వ‌స్తుంటే చూస్తూ ఊరుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు. "అర్జున్ రెడ్డి" లాంటి సినిమాల్లో అడ‌ల్ట్ తో పాటే క‌థ‌ను కూడా చెప్పారు. "ఆర్ఎక్స్ 100"లో క‌థ కాస్త త‌గ్గి.. ముద్దుల డోస్ ఇంకాస్త పెరిగింది. ఈ మ‌ధ్య‌ కాలంలో కేవ‌లం ముద్దుల‌తోనే కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇందులో ఏడు చేపల కథ అన్నింటికీ తాత. బూతు తప్ప మరోటి లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్యామ్.

తొలి టీజర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం సినిమా గురించి చాలా మంది చర్చించుకున్నారు. ఇప్పుడు మరోసారి చర్చకు కాదు కాదు రచ్చకు దారి తీస్తుంది ఈ చిత్రం. స్యామ్ జే చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు సినిమా అడ‌ల్ట్ స్థాయిని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. బూతు సినిమాలు కూడా బిత్త‌ర‌పోయేలా టీజ‌ర్ క‌ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఇది చూసిన త‌ర్వాత అస‌లు థియేట‌ర్స్‌లో విడుద‌ల అవుతుందా అనేది కూడా అనుమాన‌మే. మ‌రి ఈ "ఏడు చేప‌ల క‌థ" అసలు ఎండుతుందో లేదో చూడాలిక.

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు