YEDU CHEPALA KATHA MOVIE BOX OFFICE COLLECTIONS TRADE GET SHOCK TA
ట్రేడ్‌కు షాక్ ఇస్తున్న ఏడు చేపల కథ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి..
ఏడు చేపల కథ కలెక్షన్స్
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో సంచలనం ఏడు చేపల కథ. మంచి చెబితే ఎవడూ చూడలేదు.. మేమంతా నాశనం అయిపోయాం అంటూ దర్శక నిర్మాతేల చెప్పి.. ఇలాంటి బూతు సినిమా చేసామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ ట్రేడ్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తున్నాయి.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో సంచలనం ఏడు చేపల కథ. మంచి చెబితే ఎవడూ చూడలేదు.. మేమంతా నాశనం అయిపోయాం అంటూ దర్శక నిర్మాతేల చెప్పి.. ఇలాంటి బూతు సినిమా చేసామని ప్రకటించారు. అన్నట్లుగానే సెన్సార్ కూడా షాకయ్యేలా తెలుగు సినిమా బూతు స్థాయి పెంచేలా ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు ఎస్జే చైతన్య. ఇప్పుడు ఈ చిత్రం విడుదలయింది. విడుదలకి ముందే హీరో అభిషేక్ రెడ్డి ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కథ కాకరకాయ కంటే కూడా మసాలాలే ఎక్కువగా ఉంటాయని ముందే చెప్పాడు. ఇప్పటికే ట్రైలర్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అదే ప్రభంజనం సృష్టిస్తోంది. రూ. 2.10 కోట్లకు అమ్మినా.. ఈ సినిమా మొదటి రోజే.. రూ.1.30 లక్షల గ్రాస్ వసూలు చేసింది.రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 90 లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రేపు ఆదివారం ఈ సినిమా ఏ రేంజ్లో వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఏడు చేపల కథ
మొత్తానికి బూతు బొమ్మతో దర్శక నిర్మాతలు సేఫ్ జోన్లో వచ్చేసారు. తెలుగులో గుంటూరు టాకీస్ తర్వాత అడల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘ఏడు చేపల కథ’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.ముందు ముందు ‘ఏడు చేపల కథ’ ఎంత వసూళు చేస్తుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.