ఎన్టీఆర్ బయోపిక్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం, వైసీపీ మధ్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 4:37 PM IST
ఎన్టీఆర్ బయోపిక్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
విజయసాయి రెడ్డి ఎన్టీఆర్ బయోపిక్
  • Share this:
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం, వైసీపీ మధ్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ.. తెలుగుదేశంపై అవకాశం దొరికిన ప్రతీసారి రెచ్చిపోతూనే ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు టీడీపీతో పాటు చంద్రబాబునాయుడును కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఈ సినిమాపై ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు విజయసాయి. ఎన్నికలకు ముందు తమ పార్టీ లబ్ధి కోసం చంద్రబాబు ఎన్టీఆర్ జీవితాన్ని కూడా స్వంతానికి వాడుకున్నాడని.. ఆయన పరువును కూడా గంగలో కలిపేసాడని విమర్శించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు పేరుతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతుంటే ఏడుపుగొండి చర్యలతో చంద్రబాబు మరింత పతనమవుతున్నాడు అంటూ ట్వీట్ చేసాడు విజయసాయి రెడ్డి.

YCP MP Vijayasai Reddy sensational tweet over NTR Biopic and comments on Nara Chandrababu Naidu pk ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం, వైసీపీ మధ్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. YCP MP Vijayasai Reddy,YCP MP Vijayasai Reddy twitter,YCP MP Vijayasai Reddy ys jagan,YCP MP Vijayasai Reddy chandrababu naidu,YCP vs TDP,YCP MP Vijayasai Reddy NTR biopic,YCP MP Vijayasai Reddy tweet NTR Biopic,Vijayasai Reddy YS Jaganmohan Reddy,AP CM YS Jagan Vijayasai Reddy,telugu cinema,balakrishna NTR Biopic,వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి,ఎన్టీఆర్ బయోపిక్,చంద్రబాబు నాయుడు,ఎన్టీఆర్ బయోపిక్ విజయసాయి రెడ్డి,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,తెలుగు సినిమా
విజయసాయిరెడ్డి, చంద్రబాబు
రాజకీయాల్లో విమర్శలు కామన్ కానీ.. ఇప్పుడు వీటి మధ్యకు సినిమాలను కూడా తీసుకొస్తున్నారు. గతంలో కూడా పలువురు వైసీపీ నేతలు ఎన్టీఆర్ బయోపిక్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేసారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా మరోసారి ఈ సినిమాలపై ట్వీట్ చేయడంతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది ఎన్టీఆర్ బయోపిక్. మరి దీనిపై బాలయ్య కానీ.. చిత్ర నిర్మాతలు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 13, 2019, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading