పండగ పూట వెక్కి వెక్కి ఏడ్చేసిన రోజా..

రోజాకు మాత్రం ఓ వెలితి అలాగే ఉండిపోయినట్లుంది. అదే.. పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం కావచ్చు. ఎందుకంటే.. తాజాగా, స్టేజీపైనే భావోద్వేగాలను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు.

news18-telugu
Updated: January 14, 2020, 4:20 PM IST
పండగ పూట వెక్కి వెక్కి ఏడ్చేసిన రోజా..
రోజా
  • Share this:
అటు టీవీ షోలు.. ఇటు రాజకీయాలు.. రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ, పర్సనల్ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు ఎమ్మెల్యే రోజా సెల్వమణి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె మరింత బిజీ అయ్యారు. ఐపీఐఐసీ చైర్‌పర్సన్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇంత బిజీ టైంలోనూ ఎంతో కాలంగా చేస్తూ వస్తున్న టీవీ షోలను మాత్రం ఆమె వదిలిపెట్టలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతిపక్షాలపై ఉగ్ర రూపం చూపిస్తూ, టీవీ షోల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. అయితే.. రోజాకు మాత్రం ఓ వెలితి అలాగే ఉండిపోయినట్లుంది. అదే.. పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం కావచ్చు. ఎందుకంటే.. తాజాగా, స్టేజీపైనే భావోద్వేగాలను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు. అందుకు అమ్మా, నాన్న ఓ సంక్రాంతి కార్యక్రమం వేదికైంది.

సంక్రాంతి సందర్భంగా మల్లెమాల ప్రొడక్షన్స్ ‘అమ్మా, నాన్న ఓ సంక్రాంతి’ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వచ్చే కార్యక్రమాలన్నింటిలో పని చేసే ఆర్టిస్టులందర్నీ ఒక వేదికపైకి తెచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలను కూడా విడుదల చేసింది. అందులో ఓ ప్రోమోలో నిజంగానే రోజా ఏడ్చేశారు. కార్యక్రమంలో భాగంగా రోజా కుమారుడు కృష్ణ లోహిత్ ఒక పాట పాడాడు. దానికి ఉబ్బితబ్బిబ్బైన రోజా.. స్టేజీపైనే తన కుమారుడిని ముద్దాడింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షూటింగ్స్‌కు, పాలిటిక్స్ అని బయటికి వెళ్లినపుడు బాగా అర్థం చేసుకుంటున్నారని భోరున ఏడ్చేశారు. కష్టపడేదంతా వాళ్ల కోసమేనని, డబ్బు అవసరం లేదు.. అమ్మా! మీరు మాత్రమే కావాలి.. అని అంటారని ఆనంద భాష్పాలు రాల్చారు. షోలో భాగమే అయినా... ఆమె నిజంగానే ఏడ్చారని, పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానన్న వెలితిని బయటపెట్టారని ఆ సన్నివేశాన్ని బట్టి అర్థం అవుతోంది.
First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading