సినీ కార్మికులకు జబర్దస్త్ జడ్జి, ఎమ్మెల్యే రోజా చేయూత..

MLA Roja: కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. చాలా రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో దాన్నే నమ్ముకుని ఉన్న వేలాది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 9:33 PM IST
సినీ కార్మికులకు జబర్దస్త్ జడ్జి, ఎమ్మెల్యే రోజా చేయూత..
రోజా (MLA Roja)
  • Share this:
కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. చాలా రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో దాన్నే నమ్ముకుని ఉన్న వేలాది మంది కార్మికులు, కళాకారులు పనుల్లేక తిండి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క పూట తిండి దొరికితే చాలు అంటూ ఆకలితో అల్లాడిపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఇండస్ట్రీలో ఎన్నో ఉంటాయి. ఏ రోజు పని ఆ రోజు చేసుకుని డబ్బులు తీసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది ఇప్పుడు దయనీయ పరిస్థితుల్లో పడిపోయారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా (File)
వైసీపీ ఎమ్మెల్యే రోజా (File)


వాళ్ల స్థితి చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లను ఇప్పుడు ఆదుకునేందుకు ముందుకు వచ్చింది నగరి వైసీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి రోజా. పేద కళాకారుల ఆకలి తీర్చేందుకు 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించింది రోజా. అంతేకాదు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయ పడేందుకు త్వరలో జోలె పట్టి విరాళాలు సేకరించేందుకు ఆలోచన కూడా రోజా ఉందని తెలుస్తుంది.

వైసీపీ ఎమ్మెల్యే రోజా (File)
వైసీపీ ఎమ్మెల్యే రోజా (File)
ఇలాంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్న తమని దాతలు ఆదుకోవాలంటున్నారు పేద సినీ కళాకారులు. ఇప్పటికే వీళ్ల కోసం చిరంజీవి కూడా కోటి రూపాయలు ఇచ్చాడు. దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాతిక లక్షలు ఇచ్చాడు. వినాయక్ 5 లక్షలు.. అల్లరి నరేష్, సతీష్ వేగేశ్న కూడా తమ సినిమాలో పని చేస్తున్న 50 మంది సినీ కార్మికులకు తలో 10 వేలు ఇచ్చారు. మొత్తానికి కరోనా వైరస్ బాధితుల కోసం సినిమా ఇండస్ట్రీ బాగానే ముందుకొస్తుంది.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు