Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 4, 2019, 9:49 PM IST
బాలయ్య రోజా ఫైల్ ఫోటోస్
బాలకృష్ణ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు.. ఇంకోవైపు బసవతారకం పనులతో తన కెరీర్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు బాలయ్య. ఈయన ప్రస్తుతం రూలర్ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఈయన. వినయ విధేయ రామ సినిమా తర్వాత పూర్తిగా మరో సినిమా పట్టాలెక్కించలేకపోయాడు బోయపాటి. ఇన్నాళ్ళకు బాలయ్య సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)
ఈ చిత్రం గురించి కొన్ని రోజులుగా ఆసక్తికరమైన వార్త ఒకటి బాగానే చక్కర్లు కొడుతుంది. అదే బాలయ్యకు విలన్ పాత్రలో రోజా నటించబోతుందని. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు విజయం సాధించడం.. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండటంతో రోజా, బాలయ్య స్క్రీన్ అప్పియరెన్స్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చేసింది. పైగా రోజా కూడా ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రోజా నటించట్లేదని.. ఈ సినిమాలోనే కాదు ఏ సినిమాలోనూ నటించడం లేదని తెలుస్తుంది.

రోజా(ఫైల్ ఫోటో)
తనకు నెగిటివ్ కారెక్టర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని తన సన్నిహితులతో రోజా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. బాలయ్య సినిమా కోసం తనతో మాట్లాడిన వాస్తవవే అయినా కూడా తను ఈ చిత్రంలో నటించడం లేదని రోజా చెప్పినట్లు సమాచారం. ఒకవేళ అది పవర్ ఫుల్ పాజిటివ్ రోల్ అయ్యుంటే ఆలోచించేదాన్నేమో కానీ విలన్ అనేసరికి అవసరం లేదని చెప్పినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. దాంతో రోజా, బాలయ్య కాంబినేషన్ ఇప్పట్లో కలవడం అసాధ్యం. జనవరి నుంచి బోయపాటి, బాలయ్య సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 4, 2019, 9:49 PM IST