ఏపీ అసెంబ్లీలో త్రివిక్రమ్.. జగన్ కోసం పంచ్ డైలాగులు..

అదేంటి.. అసెంబ్లీలో త్రివిక్రమ్ ఏంటి.. ఆయన ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.. రాజకీయాలతో పనిలేకుండా గడుపుతున్నాడు కదా అనుకుంటున్నారా..? నిజమే కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఏపీ అసెంబ్లీలోనే వినిపించాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2020, 7:31 AM IST
ఏపీ అసెంబ్లీలో త్రివిక్రమ్.. జగన్ కోసం పంచ్ డైలాగులు..
త్రివిక్రమ్ వైఎస్ జగన్ ఫైల్ ఫోటోస్
  • Share this:
అదేంటి.. అసెంబ్లీలో త్రివిక్రమ్ ఏంటి.. ఆయన ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.. రాజకీయాలతో పనిలేకుండా గడుపుతున్నాడు కదా అనుకుంటున్నారా..? నిజమే కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఏపీ అసెంబ్లీలోనే వినిపించాడు.. మాటల్లో కనిపించాడు కూడా. సినిమాల్లోనే కాదు.. ఎక్కడ బడితే అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ పాపులర్ అయిపోతున్నాడు. ఎవరిపై అయినా పంచులు వేయాలన్నా.. ఎవర్ని అయినా ఆకాశానికి ఎత్తాలన్నా గురూజీ డైలాగులు బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో సిఎం జగన్‌ను పొగడటానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు వాడేసుకున్నారు శాసన సభ్యులు.

YCP Leaders using Trivikram Srinivas dialogues to praise AP CM YS Jagan Mohan Reddy in assembly pk అదేంటి.. అసెంబ్లీలో త్రివిక్రమ్ ఏంటి.. ఆయన ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.. రాజకీయాలతో పనిలేకుండా గడుపుతున్నాడు కదా అనుకుంటున్నారా..? నిజమే కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఏపీ అసెంబ్లీలోనే వినిపించాడు.. trivikram,pushpa srivani ys jagan,roja ys jagan,pushpa srivani ap assembly ys jagan,ap assembly,ap assembly live,ap assembly today,ap assembly live 2020,ap assembly sessions 2020,ap assembly 2020,live ap assembly 2020,ap assembly live 2020 day 2,2020 live ap assembly,ap news,ap capital issue,nandamuri balakrishna in ap assembly 2020 session,assembly session 2020,live ap assembly,ap assembly latest,ap assembly sessions 2019,ap assembly news live,ap assembly sessions,telugu cinema,త్రివిక్రమ్ శ్రీనివాస్,ఏపీ అసెంబ్లీ,అసెంబ్లీలో జగన్ కోసం త్రివిక్రమ్,పుష్ప శ్రీవాణి త్రివిక్రమ్,రోజా త్రివిక్రమ్ అరవింద సమేత
పుష్ప శ్రీవాణి


గతేడాది సమావేశాల్లో అరవింత సమేత చిత్రంలోని టార్చ్ బేరర్ డైలాగ్‌ను జగన్‌ కోసం వాడేసింది రోజా. ప్రతి సంవత్సరానికి బతుకు ఆలోచన మారుతుందంటారు అధ్యక్షా.. దాన్ని సినిమా లాంగ్వేజ్‌లో ట్రెండ్ అంటారు... రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్‌కి ఆ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లేది ఒక్కరే ఉంటారు. ఆయన్నే టార్చ్ బేరర్ అంటారు అంటూ జగన్ గురించి అరవింద సమేత డైలాగులు చెప్పింది రోజా. ఇది మరిచిపోకముందే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా త్రివిక్రమ్ డైలాగ్ చెప్పేసింది. ఖలేజా సినిమాలో మహేష్ కోసం రాసిన నువ్వు శిఖరం సామి.. అనుకుంటే అయిపోతుంది అంటూ అసెంబ్లీలో అదిరిపోయే స్పీచ్ ఇచ్చింది.

YCP Leaders using Trivikram Srinivas dialogues to praise AP CM YS Jagan Mohan Reddy in assembly pk అదేంటి.. అసెంబ్లీలో త్రివిక్రమ్ ఏంటి.. ఆయన ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నాడు.. రాజకీయాలతో పనిలేకుండా గడుపుతున్నాడు కదా అనుకుంటున్నారా..? నిజమే కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఏపీ అసెంబ్లీలోనే వినిపించాడు.. trivikram,pushpa srivani ys jagan,roja ys jagan,pushpa srivani ap assembly ys jagan,ap assembly,ap assembly live,ap assembly today,ap assembly live 2020,ap assembly sessions 2020,ap assembly 2020,live ap assembly 2020,ap assembly live 2020 day 2,2020 live ap assembly,ap news,ap capital issue,nandamuri balakrishna in ap assembly 2020 session,assembly session 2020,live ap assembly,ap assembly latest,ap assembly sessions 2019,ap assembly news live,ap assembly sessions,telugu cinema,త్రివిక్రమ్ శ్రీనివాస్,ఏపీ అసెంబ్లీ,అసెంబ్లీలో జగన్ కోసం త్రివిక్రమ్,పుష్ప శ్రీవాణి త్రివిక్రమ్,రోజా త్రివిక్రమ్ అరవింద సమేత
ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి




నీ కోపం ప్రళయం అంటూ మన్మథుడు డైలాగులు కూడా వాడేసింది డిప్యూటీ సిఎం. ఇక ‘జీ తెలుగు’లో ప్రసారమయ్యే ‘రామసక్కని సీత’ సీరియల్‌లోని ఫేమస్ డైలాగ్‌ను జగన్‌కి అనునయించింది పుష్ప శ్రీవాణి. ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్షా.. ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది. పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి అధ్యక్షా.. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్షా.. కాని మన ప్రజలు పాలతో కలవాలో.. బొగ్గుతో కలవాలో నిర్ణయించుకుని స్వచ్ఛమైన పాలలాంటి మనసు ఉన్న జగన్ అన్నతో కలిసి నడిచారు అధ్యక్షా’ అంటూ డైలాగ్‌ చెప్పడంతో జగన్ నవ్వుల్లో మునిగిపోయాడు. మొత్తానికి అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకోడానికి త్రివిక్రమ్ డైలాగులు వాడేసుకుంటున్నారు వైసీపీ సభ్యులు.
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు