బాలయ్య ముక్కోపి అంటున్న వైసీపీ నేత.. కారణం ఏంటంటే..

బాలయ్య అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అలాగే బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ కూడా. రియల్ లైఫ్‌లో కూడా చాలా పాత్రలు పోషిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈయన గురించి వైసీపీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2020, 1:16 PM IST
బాలయ్య ముక్కోపి అంటున్న వైసీపీ నేత.. కారణం ఏంటంటే..
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
  • Share this:
బాలయ్య అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అలాగే బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ కూడా. రియల్ లైఫ్‌లో కూడా చాలా పాత్రలు పోషిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈయన గురించి వైసీపీ నేత పోసాని కీలక వ్యాఖ్యలు చేసాడు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి. మల్టీ టాలెంటెడ్ అనే పదానికి ఆయన నిదర్శనం. రచయితగా వచ్చి దర్శకుడిగా మారి నటుడిగా ఎదిగి.. కమెడియన్‌గా స్టార్ అయ్యాడు పోసాని. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గానే ఉన్నాడు ఈయన. వైసీపీలో ఉన్నాడు పోసాని.. సొంత పార్టీలోని పృథ్వీ లాంటి వాళ్లపై కూడా ఫైర్ అయ్యాడు పోసాని.
YCP Leader Posani Krishna Murali interesting comments on Nandamuri Balakrishna behavior pk బాలయ్య అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అలాగే బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ కూడా. రియల్ లైఫ్‌లో కూడా చాలా పాత్రలు పోషిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈయన గురించి వైసీపీ.. balakrishna,posani krishna murali,posani krishna murali balakrishna,ycp leader posani krishna murali,posani krishna murali twitter,posani krishna murali ys jagan,balakrishna nandamuri posani krishna murali,ys jagan balakrishna,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,పోసాని కృష్ణమురళి,తెలుగు సినిమా
బాలయ్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పోసాని

తప్పు చేస్తే సొంత వాళ్లను కూడా ఆడేసుకుంటాడు ఈయన. అలాంటిదిప్పుడు ఈయనకు బాలయ్య గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి చెప్పండి అంటూ పోసానిని అడిగితే.. ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు పోసాని. ఆయనతో తను పనిచేసానని.. రైటర్‌గా రెండు సినిమాలు రాసానని గుర్తు చేసుకున్నాడు పోసాని. బాలయ్య చాలా మంచి మనిషి అంటూ ఆకాశానికి ఎత్తేసాడు ఆయనతో కలిసి రెండు సినిమాలు చేశాను అని తెలిపారు ఆయన. అంతేకాదు బాలయ్య కోపంపై కూడా కామెంట్ చేసాడు పోసాని. ఆయనకు కోపం ఎక్కువంటారు.. కానీ దాని వెనక కూడా ఓ కారణం ఉంది.. కావాలని బాలయ్య ఎవర్నీ ఏమనరు.
YCP Leader Posani Krishna Murali interesting comments on Nandamuri Balakrishna behavior pk బాలయ్య అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అలాగే బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ కూడా. రియల్ లైఫ్‌లో కూడా చాలా పాత్రలు పోషిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈయన గురించి వైసీపీ.. balakrishna,posani krishna murali,posani krishna murali balakrishna,ycp leader posani krishna murali,posani krishna murali twitter,posani krishna murali ys jagan,balakrishna nandamuri posani krishna murali,ys jagan balakrishna,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,పోసాని కృష్ణమురళి,తెలుగు సినిమా
బాలయ్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పోసాని

తనకు ఏదైనా అనిపిస్తే దాచుకోకుండా మొహంపైనే చెప్పేస్తారు.. అది కూడా మంచిదే కదా.. మనసులో పెట్టుకుని కుళ్లుకునే కంటే కూడా అనిపించింది అనిపించినట్లు చెప్పడం మంచిదే కదా అంటున్నాడు పోసాని. మనిషి ముందు ఒక మాట .. తర్వాత ఓ మాట అనడం ఆయనకి తెలియదని చెప్పాడు పోసాని. అందరిని సమానంగా చూడటం బాలయ్య నైజం అని చెప్పుకొచ్చాడు పోసాని. ఎవరికైనా సమస్య ఉంటే పట్టించుకుంటాడు.. తన వరకు దాన్ని పరిష్కరించడానికి ఆలోచిస్తాడు అంటూ బాలయ్య కారెక్టర్ గురించి చెప్పాడు పోసాని. అవినీతి అక్రమాలు అనేవి తెలియని స్వచ్ఛమైన మనిషి అంటూ బాలయ్యను మునగచెట్టెక్కించాడు పోసాని కృష్ణమురళి.
Published by: Praveen Kumar Vadla
First published: January 21, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading