YCP LEADER 30 YEARS PRUDHVI CAREER IN DANGER AFTER THE AUDIO TAPE CAME OUT PK
30 ఇయర్స్ పృథ్వీ ఎక్కడ.. వెనక నుంచి వాటేస్తే ఇన్ని కష్టాలా..?
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పృథ్వీ... ఆక్సిజన్ సహాయంతో వీడియోలో మాట్లాడటం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
30 Years Prudhvi: 30 ఇయర్స్ పృథ్వీ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నాడు. ఆడియో టేప్ దొరికిన తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది.
కమెడియన్లు కామెడీ చేయాలి.. నవ్వించాలి.. కానీ అందరి ముందు తాము చేసే వ్యాఖ్యలతో నవ్వుల పాలు కాకూడదు కదా. వాళ్లపై వాళ్లే కమెంట్స్ చేసుకుని దిగజారిపోతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎంతమంది ఉన్నా అందరికీ మంచి పేరుంది. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ 30 ఇయర్స్ పృథ్వీ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నాడు. కావాలనే అందరితోనూ సున్నం పెట్టుకుంటున్నాడు ఈయన. మొన్నటికి మొన్న ఎలక్షన్ సమయంలో 30 ఇయర్స్ పృథ్వీ.. మరో కమెడియన్, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లపై కూడా విరుచుకుపడ్డాడు పృథ్వీ.
30 ఇయర్స్ పృథ్వీ (30 years prudhvi)
ఆ తర్వాత కమెడియన్ సునీల్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు పృథ్వీ. సునీల్ రీ ఎంట్రీ తర్వాత పొడిచేదేం లేదన్నాడు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఇండస్ట్రీపైనే నోరు పారేసుకున్నాడు. వైఎస్ జగన్ గెలిచినా కూడా ఎవరూ వచ్చి విష్ చేయడం లేదంటూ అందరిపై విమర్శల వర్షం కురిపించాడు. ఇక తర్వాత ఏకంగా మెగా కుటుంబాన్నే టార్గెట్ చేసాడు ఈయన. ఎన్నికల సమయంలో కావాలనే మెగా హీరోలందర్నీ లక్ష్యంగా చేసుకుని విమర్శించాడు పృథ్వీ. ఆ తర్వాత మెగా కుటుంబంతో తనకేం శత్రుత్వం లేదని.. అంతా తనకు స్నేహితులే అని చెప్పుకొచ్చాడు ఈయన.
30 ఇయర్స్ పృథ్వీ (30 years prudhvi)
దానికి ముందు మాత్రం పవన్ కళ్యాణ్ మొదలుకొని నాగబాబు, వరుణ్ తేజ్ లాంటి వాళ్లపై కూడా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేసాడు ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. అప్పుడు జనసేన పార్టీకి నాగబాబు ఇచ్చిన కోటి రూపాయలు అక్రమంగా సంపాదించినవి కాదా అంటూ రెచ్చిపోయాడు ఈయన. తర్వాత పవర్ స్టార్ పార్టీ గురించి కూడా కామెంట్స్ చేసాడు. ఇవన్నీ మెగా హీరోలకు బాగానే కోపం తెప్పించాయి. దాంతో ఇప్పుడు మెగా హీరోల సినిమాల్లో పృథ్వీని తీసుకోకూడదనే వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆ మధ్య ఓ మెగా హీరో సినిమా నుంచి పృథ్వీని తప్పించారు కూడా. ఆ తర్వాత చిరంజీవి సైరాలో ఈయన మంచి పాత్రే చేసాడు. అలాంటిదేం లేదని.. తనకు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెబుతున్నాడు.
30 ఇయర్స్ పృథ్వీ (30 years prudhvi)
ఇవన్నీ ఇలా ఉంటే 30 ఇయర్స్ పృథ్వీ కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిపోయింది. ఒకప్పుడు వరస సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న ఓ ఆడియో టేప్‌లో ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు పృథ్వీ. దాంతో SVBC ఛైర్మన్ పదవి కూడా పోయింది. ఈ విషయంపై వైసీపీలో 30 ఇయర్స్ పృథ్వీపై కొందరు సెటైర్లు కూడా వేసినట్లు తెలుస్తుంది. ఆ వాయిస్ తనది కాదని ఎంత చెప్పినా కూడా బయట మాత్రం ఆ డైలాగులు బాగా ఫేమస్ అయిపోయాయి. వెనకనుంచి వాటేసుకుందామనుకున్నా అంటూ టేపులో ఉన్న మాట వైరల్ అయిపోయింది. జబర్దస్త్, అదిరింది లాంటి షోలలో అదే వాడేసుకున్నారు. ఆ తర్వాతే ఆయనకు సినిమా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. ఏదేమైనా కూడా వెనకనుంచి వాటేసుకుంటే ఇన్ని కష్టాలుంటాయా అంటూ 30 ఇయర్స్ పృథ్వీపై జోకులు పేలుతున్నాయిప్పుడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.