Yatra Movie Review : ‘యాత్ర’ మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైయస్ఆర్

Yatra Movie Review | దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర యాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి.వి.రాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్టుట్టి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 8, 2019, 11:39 AM IST
Yatra Movie Review : ‘యాత్ర’ మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైయస్ఆర్
‘యాత్ర’ సినిమా
  • Share this:
నటీనటులు: మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని మణిరత్నం,  రావు రమేష్ తదితరులు

నిర్మాణం : 70 MM ఎంటర్టైన్మెంట్స్

దర్శకత్వం: మహి.వి.రాఘవ్

రేటింగ్ : 3 / 5దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర యాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి.వి.రాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్టుట్టి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రంలో రైతుల స్థితు గతులు  ఎలా ఉన్నాయనే దానిపై ఈ సినిమా స్టోరీ మొదలైవుతుంది. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ప్రజల కష్టాలను చూసి చలించి పోయి వైయస్ఆర్ పాద యాత్రకు పూనుకుంటాడు. ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటాడు. పాద యాత్ర తర్వాత వైయస్ఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్, ఆయనకు ఎలా పేరు తీసుకొచ్చాయి. తిరిగి రెండోసారి సీఎం అవ్వడం..హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా కన్నుమూసాడనేదే ‘యాత్ర’ స్టోరీ.నటీనటుల విషయానికొస్తే ..

‘యాత్ర’ సినిమాలో వైయస్.రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టి కాకుండా..వేరే నటుడిని ఊహించుకోవడం కష్టం అనే రేంజ్‌లో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అనే రీతిలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి హావభావాలు, మొండితనన్ని తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం కంటే అన్ని తానై పార్టీని ముందుకు నడిపించడంలో ఆయన మొండితనం ఎలా ఉండదో మమ్ముట్టి తన నటనతో చూపించాడు. ముఖ్యంగా యాత్ర సందర్భంగా రైతుల కష్టాలు, కరెంట్ సమస్యలపై చలించపోవడం వంటి ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా  నటీనటుల విషయానికొస్తే వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు కాసేపు ఉన్న పర్వాలేదనిపించాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు ఉన్నంతలో పర్వాలేదనపించారు. 

విశ్లేషణ..

ముఖ్యంగా ‘యాత్ర’ సినిమాకు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి..పాదయాత్రతో ఎలా ముఖ్యమంత్రి కావడం..ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాడనే కాన్సెప్టే ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమాలో వైయస్ పాత్రను మమ్ముట్టి ఒదిగిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెబల్‌గా ఆయన నైజాన్ని చూపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు ఎవరు సీఎం అయిన పర్వాలేదు కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాకుడదు. అలా సొంత పార్టీలో విపక్షాన్ని ఎదుర్కొని ఎలా మహానాయకుడుగా ఎదిగాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు పెంచినందకు నిరసనగా ధర్నా చేపట్టిన రైతులపై అప్పటి బాబు గవర్నమెంట్ బషీర్‌బాగ్‌లో కాల్పులు జరపించిండం ఈ సినిమాకు హైలెట్. ముఖ్యంగా పాదయాత్ర నేపథ్యంలో కరెంటు ఛార్జీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం..ఈ కోవలోనే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలనే ఆలోచన వైయస్ఆర్‌కు రావడం వంటివి చూపించారు. మరోవైపు ఆరోగ్యం కోపం ప్రజల కష్టాలకు చలించపోయి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలు, డబ్బులు కట్టలేక పెద్ద చదువులు చదవలేకపోయిన  వారికోసం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశం పెట్టడంతో చిన్న, మధ్యతరగతి ప్రజలకు పెద్ద చదువులను దగ్గరచేయడం వంటివి చాలా ఎమోషనల్‌ సీన్స్  ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. స్టోరీ, కటెంట్  పరంగా బాగున్నా...ఈ సినిమా నేరేషన్ మాత్రం చాలా స్లాగా సాగడం మైనస్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తంగా క్లైమాక్స్‌లో వైయస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విజువల్స్‌ను నిజంగానే చూపించి ప్రేక్షకులను ఎమోషన్ గురిచేసారు.

ముఖ్యంగా బీ, సీ సెంటర్ ఆడియన్స్‌కు  ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు పరభాషా నటుడు కావడం మరో మైనస్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ‘యాత్ర’ సినిమా తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.

మొత్తంగా ‘యాత్ర’ సినిమా ఎమోషనల్  జర్నీ ఆఫ్ వైయస్ఆర్ 

 

ప్లస్ పాయింట్స్ 

వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర కథ

మమ్ముట్టి నటన

ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ 

స్లో నేరేషన్

ఒక పార్టీకే అనుకూలంగా ఉండటం

మాస్ ఆడియన్స్ కోరుకునే సన్నివేశాలు లేకపోవడంఇవి కూడా చదవండి

ఒకే రోజు వస్తోన్న ఇద్దరు మాజీ సీఎంలు..యాత్ర Vs ఎన్టీఆర్ కథానాయకుడు

మోహన్ బాబు సినిమాలో రణ్‌వీర్, వరుణ్ ధావన్.. వీళ్లెవరండీ బాబూ..

బాలకృష్ణ ఫిల్మ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్..‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో తీరింది

 
First published: February 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading