‘యాత్ర 2’ ఉందా.. దర్శకుడు మహి వి రాఘవ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన చిత్రం యాత్ర.దర్శకుడు మహి రాఘవ మహానేత వైఎస్సార్ పాదయాత్రతో పాటు, ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 1, 2020, 6:53 PM IST
‘యాత్ర 2’ ఉందా.. దర్శకుడు మహి వి రాఘవ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
‘యాత్ర’ సినిమా (Yatra movie)
  • Share this:
తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన చిత్రం యాత్ర.దర్శకుడు మహి రాఘవ మహానేత వైఎస్సార్ పాదయాత్రతో పాటు, ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆ మహానేత పాత్రలోకి మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేసిన తీరు సమ్మోహన పరిచింది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఈ సినిమా సీక్వెల్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత కథా విశేషాలతో యాత్ర 2 ప్లానింగ్ జరుగుతోందని.. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.
యాత్ర దర్శకుడుతో మహి వి రాఘవతో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ (Twitter/Photo)
యాత్ర దర్శకుడుతో మహి వి రాఘవతో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ (Twitter/Photo)


కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని దర్శకుడు మహి.వి.రాఘవ న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేసాడు. అసలు తనకు యాత్ర -2 ప్రాజెక్ట్ తెరకెక్కించే ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు రాఘవ. యాత్ర మొదటి భాగం విడుదలైనప్పుడు క్లైమాక్స్‌లో సీక్వెల్ కు సంబంధించిన హింట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దాంతో చాలా కాలంగా ఈ సినిమా సీక్వెల్ కచ్చతంగా వస్తుందని చర్చ జరుగుతోంది. ఒక దశలో తమిళ స్టార్ హీరో సూర్య యాత్ర 2లో భాగం కాబోతున్నట్లు బాగా ప్రచారం సాగింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు టాక్ వినిపించింది. వైఎస్ కుటుంబంతో సూర్యకు ప్రత్యేక అనుబంధమే ఉంది.
యాత్ర సీక్వెల్
యాత్ర సీక్వెల్

దాంతో నిజంగానే సూర్య ఈ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. సూర్య ఇతర ప్రాజెక్టుల్లో బిజీ కావడంతో యాత్ర సీక్వెల్ అనేది మరుగున పడిపోయింది. ఈ మధ్యే యాత్ర 2పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. మహి వి రాఘవ స్టైలిష్ స్టార్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం మొదలైంది. పుష్ప మూవీ తర్వాత మహి రాఘవతో కలసి అల్లు అర్జున్ యాత్ర 2 చేస్తాడనే ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు కొరటాల శివతో బన్నీ తర్వాతి సినిమా కన్ఫర్మ్ కావడంతో యాత్ర 2 పుకారు అని తేలిపోయింది. ఇప్పుడు మహి వి రాఘవ కూడా ఇదే విషయం చెప్పడంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

(Byline: A.Venkateswara Rao న్యూస్ 18 ప్రతినిథి)
Published by: Praveen Kumar Vadla
First published: August 1, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading