‘యాత్ర’ 4 డేస్ క‌లెక్ష‌న్స్.. వైయస్ పాదయాత్ర బ్లాక్ బస్టర్..

2003లో చేసిన వైఎస్ఆర్ పాదయాత్ర అప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర‌పై చేసిన సినిమా కూడా ర‌ప్ఫాడిస్తుంది. యాత్ర సినిమా రోజురోజుకీ త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ ముగిసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 6:06 AM IST
‘యాత్ర’ 4 డేస్ క‌లెక్ష‌న్స్.. వైయస్ పాదయాత్ర బ్లాక్ బస్టర్..
యాత్ర పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 6:06 AM IST
2003లో చేసిన వైఎస్ఆర్ పాదయాత్ర అప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర‌పై చేసిన సినిమా కూడా ర‌ప్ఫాడిస్తుంది. యాత్ర సినిమా రోజురోజుకీ త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ ముగిసింది. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు అనిపించినా.. మూడో రోజు మాత్రం దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. పైగా ఆదివారం కావ‌డంతో ఆడుకుంది. నాలుగో రోజు కూడా చాలా చోట్ల ఈ చిత్రం మంచి వ‌సూళ్ల‌నే సాధిస్తుంది. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా దాదాపు కోటికి పైగానే షేర్ తీసుకొస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్ ముగిసేస‌రికి 10 కోట్లకు పైగానే గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.

Yatra movie 1st Weekend Collections.. YSR Biopic Ruling Box Office all over the World pk.. 2003లో చేసిన వైఎస్ఆర్ పాదయాత్ర అప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర‌పై చేసిన సినిమా కూడా ర‌ప్ఫాడిస్తుంది. యాత్ర సినిమా రోజురోజుకీ త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ ముగిసింది. Yatra movie Collections,Yatra movie 4 days Collections,yatra 4 days ww collections,Yatra movie 1st weekend Collections,Yatra movie 1st weekend worldwide Collections,yatra 1st weekend ww collections,Yatra Worldwide Collections,yatra ww collections,mammotty yatra 1st weekend collections,ysr biopic yatra movie collections,Yatra movie 4 days Worldwide Collections,యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,యాత్ర ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్,యాత్ర 4 డేస్ కలెక్షన్స్,యాత్ర వసూళ్లు,యాత్ర కలెక్షన్స్,యాత్ర 4 రోజుల కలెక్షన్స్,వైఎస్ఆర్ యాత్ర కలెక్షన్స్,తెలుగు సినిమా
యాత్ర పోస్టర్

ఇండియా, ఓవ‌ర్సీస్ క‌లిపి 5.40 కోట్లు షేర్ వ‌సూలు చేసింది యాత్ర‌. మ‌మ్ముట్టి హీరోగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ఏరియాల్లో ర‌ప్ఫాడిస్తుంది ఈ చిత్రం. రాయ‌ల‌సీమ ఎలాగూ వైఎస్ సొంత స్థ‌లం కాబ‌ట్టి అక్క‌డ ఈ చిత్రానికి నీరాజ‌నాలు ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత రెండు రోజుల్లో మ‌రో 6 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. మ‌రో రెండు వారాల వ‌ర‌కు సినిమాలే లేక‌పోవ‌డం కూడా యాత్ర‌కు క‌లిసి రానుంది. కార్తి దేవ్ సినిమా వ‌స్తున్నా కూడా పెద్ద‌గా అంచ‌నాల్లేవు.

Yatra movie 1st Weekend Collections.. YSR Biopic Ruling Box Office all over the World pk.. 2003లో చేసిన వైఎస్ఆర్ పాదయాత్ర అప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర‌పై చేసిన సినిమా కూడా ర‌ప్ఫాడిస్తుంది. యాత్ర సినిమా రోజురోజుకీ త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది. ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ ముగిసింది. Yatra movie Collections,Yatra movie 4 days Collections,yatra 4 days ww collections,Yatra movie 1st weekend Collections,Yatra movie 1st weekend worldwide Collections,yatra 1st weekend ww collections,Yatra Worldwide Collections,yatra ww collections,mammotty yatra 1st weekend collections,ysr biopic yatra movie collections,Yatra movie 4 days Worldwide Collections,యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,యాత్ర ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్,యాత్ర 4 డేస్ కలెక్షన్స్,యాత్ర వసూళ్లు,యాత్ర కలెక్షన్స్,యాత్ర 4 రోజుల కలెక్షన్స్,వైఎస్ఆర్ యాత్ర కలెక్షన్స్,తెలుగు సినిమా
యాత్ర పోస్టర్
మ‌మ్ముట్టి న‌ట‌న‌.. మ‌హి వి రాఘ‌వ్ టేకింగ్.. వైఎస్ అభిమానులు.. అన్నింటికి తోడు పాజిటివ్ టాక్.. ఇలా ఇప్పుడు అన్నీ యాత్ర సినిమాకు క‌లిసొస్తున్నాయి. దాంతో వైసిపి వ‌ర్గాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అంచ‌నాలు అందుకోలేక‌పోయిన స‌మ‌యంలో వ‌చ్చి వైఎస్ బ‌యోపిక్ అద్భుతాలు చేస్తుండ‌టంతో ఆనందంలో ఉన్నారు వాళ్లు. ఓవ‌ర్సీస్లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసిన‌ట్లుగా తెలుస్తుంది. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం మ‌రో వారంలో సేఫ్ జోన్ చేరి హిట్ అనిపించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...