రిలీజ్ తేదీ | : | 11/11/2022 |
దర్శకుడు | : | హరి & హరీష్ |
సంగీతం | : | మణిశర్మ (Mani Sharma) |
నటీనటులు | : | సమంత, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్,మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు.. |
సినిమా శైలి | : | సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ |
సినిమా నిడివి | : | 2 Hr 31 M |
రివ్యూ : యశోద (Yashoda)
నటీనటులు : సమంత, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్,మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు..
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: M,సుకుమార్
సంగీతం: మణిశర్మ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ (శ్రీదేవి మూవీస్)
దర్శకత్వం: హరి, హరీష్
విడుదల తేది : 11/11/2022
సమంత నటించిన లేటెస్ట్ ప్యాన్ ఇండియా సినిమా యశోద. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో సమంత హిట్ అందుకుందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
యశోద కథ విషయానికొస్తే.. యశోద (సమంత) ఆర్ధిక అవసరాల కోసం అద్దె గర్భానికి (సరోగసీ)కి రెడీ అవుతోంది. యశోద తరహాలోనే ఎంతో మంది ఆడవాళ్లు తమ ఆర్ధిక అవసరాల కోసం ఈ అద్దె గర్భం దాలుస్తారు. ఈ నేపథ్యంలో యశోద ఎక్కడైతే.. సరోగసీ కోసం ఉంటుందో ఆ హాస్పిటల్లో సరోగసీ మాటున పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో యశోద సరోగసీ మాటున ఉన్న ఆ మాఫియాను ఎలా పట్టుకుంటుంది. అసలు యశోద అద్దె గర్భం ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. చివరకు సరోగసీ మాటున ఉన్న మాఫియా అంతు తేల్చిందా లేదా అనేది యశోదా మూవీ స్టోరీ.
కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు. రీసెంట్గా నయనతార దంపతులు కూడా సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు కవలకు జన్మనిచ్చారు. దీనిపై పెద్ద రచ్చే నడిచింది. నయనతార తరహాలో ఎంత మంది పెద్ద సెలబ్రీటీలు ఈ తరహాలోనే పిల్లలను కనడం ఎక్కువైపోయింది. ఈ పాయింట్ బేస్ చేసుకొని దర్శకుడు హరి, హరీష్ సమంత ప్రధాన పాత్రలో యశోద సినిమాను తెరకెక్కించారు. భాగవతంలో యశోద ఎలా మథురలో పుట్టిన శ్రీ కృష్ణుడిని బృందావనంలో పెంచుతుందో.. అదే తరహాలో వేరే వాళ్లకు సంబంధించిన పిల్లలను సరోగసి ద్వారా తమ గర్భంలో నవ మాసాలు మోసి కనేవాళ్ల గురించి ఈ సినిమాలో చూపించారు. ఒక రకంగా యశోద టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చారు దర్శకులు. మొత్తంగా ఈ చిత్రంలో సరోగసీ కాకుండా.. సరోగసీని అడ్డుపెట్టుకొని దాని వెనక అక్రమాలకు పాలుపడే వారిని యశోద (సమంత) ఎలా వాళ్ల అంతు చూసిందనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో దర్శకులు ఓ పాయింట్ అనుకోని దానికి సరోగసీని బెస్ చేసుకొని చక్కగా కథను అల్లుకున్నారు.
హాలీవుడ్లో వచ్చిన Level 16 సినిమాను ఇన్స్ప్రిరేషన్గా తీసుకున్నారు. చివరకు ప్రీ క్లైమాక్స్‌లో హీరోయిన్ యశోద ఎవరు ? ఆమె ఎందుక అద్దె గర్భం ధరించాల్సి వచ్చిందనే పాయింట్‌ను చక్కగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రేక్షకులకు ఎక్కడ కన్ప్యూజన్ లేకుండా చేయడంలో విజయం సాధించారు. తాము అనుకున్న కథను ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చేసారు. ఈ సినిమాలో ఇతర టెక్నీషియన్స్ విషయానికొస్త.. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఎడిటింగ్ వర్క్.. ఫోటోగ్రఫీ.. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్ మాస్టర్ కూడా తనదైన మార్క్ చూపించారు.
నటీనటుల విషయానికొస్తే..
సమంత మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. యశోద పాత్రలో నటించడం అనే కంటే జీవించిందనే చెప్పాలి. ముఖ్యంగా అవార్డు విన్నింగ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫైట్స్‌లో మంచి ఈజ్ చూపించింది. ఒక ఇంటిలిజెంట్ లేడీగా తన మార్క్ చూపించుకోవడంలో సక్సెస్ అయింది. ఈ సినిమాలో సమంత తర్వాత మరో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనదైన విలనిజాన్ని పండించింది. ఈ తరహా పాత్రలకు తనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో మేల్ లీడ్‌లో నటించిన ఉన్ని ముకుందన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నటించిన సంపత్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ, శత్రు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
ప్లస్ పాయింట్స్
కథ
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన
ఫస్టాఫ్
మణిశర్మ రీ రికార్డింగ్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
చివరి మాట: సమంత మార్క్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్
రేటింగ్ : 2.75 /5
కథ | : | 3/5 |
స్క్రీన్ ప్లే | : | 2.5/5 |
దర్శకత్వం | : | 3/5 |
సంగీతం | : | 3.5/5 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha Ruth Prabhu, Telugu Cinema, Tollywood, Yashoda Movie, Yashoda Movie Review