కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన కేజీఎఫ్ 2 డిజిటల్ రైట్స్..

కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యష్ హీరోగా బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: May 7, 2020, 8:37 AM IST
కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన కేజీఎఫ్ 2 డిజిటల్ రైట్స్..
కెజియఫ్ 2 (KGF Chapter 2 release date)
  • Share this:
కన్నడ ఫిల్మ్ KGF బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యష్ హీరోగా బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది. అంతేకాదు ఈ సినిమాతో యశ్ నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రంకు ఇపుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్‌ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు అతనితో సినిమా చేయాలని తెలుగు హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు ఎదురు చూస్తున్నారు. ఐతే... ఫస్ట్ పార్ట్‌లో చాలా మంది నటులు ఎవరో కూడా తెలియదు. అదే తెలిసిన నటులతో సినిమాని నిర్మించి ఉంటే... ఇంకా ఎక్కువ పేరు వచ్చేదన్న ప్రచారం జరిగింది. అందుకే సెకండ్ పార్ట్‌లో ఫేమస్ యాక్టర్లను దించారు. సీక్వెల్‌లో ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధిర పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు రమ్యకృష్ణ, రవీనా టాండన్ కూడా సెకండ్ పార్ట్‌లో నటిస్తూ.. ఈ సినిమా క్రేజ్ పెంచారు.

కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)
కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)


కరోనా ప్రభావం లేకుంటే ఈ సినిమా ఈ యేడాదే విడుదలై ఉండేది. ఆ సంగతి పక్కనె పెడితే.. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ రేటు పెట్టి కొనుక్కుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ డిజిటల్ రైట్స్‌ కూడా అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుక్కొని ప్రసారం చేసింది. అంతేకాదు అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ మంది ఈ సినిమాను వీక్షించినట్టు అమెజాన్ ప్రైమ్ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేజీఎఫ్ 2 డిజిటల్ రైట్స్ అన్ని భాషలు (కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ) కలిపి రూ. 55 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తానికి కేజీఎఫ్ సృష్టించిన సంచలనంతో ఇపుడు కేజీఎఫ్ 2 మూవీపై అన్ని భాషల్లో భారీ డిమాండ్ ఏర్పడింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 7, 2020, 8:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading