మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యశ్ ‘కేజీఎఫ్’

‘బాహుబలి’ సిరీస్‌తో దక్షిణాది చిత్ర పరిశ్రమ సత్తా ఏందో అందరికీ తెలిసింది. ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమ అన్ని రికార్డులను తిరగరాసింది. ఇపుడు అన్ని చిత్ర పరిశ్రమలు వాళ్ల వాళ్ల భాషల్లో భారీ చిత్రాలను నిర్మించే పనిలో పడ్డారు. తాజాగా కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడతో పాటు అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

news18-telugu
Updated: January 2, 2019, 10:19 AM IST
మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యశ్ ‘కేజీఎఫ్’
కేజియఫ్ కలెక్షన్లు
  • Share this:
‘బాహుబలి’ సిరీస్‌తో దక్షిణాది చిత్ర పరిశ్రమ సత్తా ఏందో అందరికీ తెలిసింది. ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమ అన్ని రికార్డులను తిరగరాసింది. ఇపుడు అన్ని చిత్ర పరిశ్రమలు వాళ్ల వాళ్ల భాషల్లో భారీ చిత్రాలను నిర్మించే పనిలో పడ్డారు. ఆల్రెడీ ‘బాహుబలి’ కంటే ముందు శంకర్ తన సినిమాలతో దక్షిణాది సినిమాల పవర్ ఏంటో చూపించాడు.

తాజాగా కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడతో పాటు అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్బులో చేరిన తొలి కన్నడ సినిమాగా రికార్డులకు ఎక్కిన ‘కేజీఎఫ’ చాప్టర్1 తాజాగా అన్ని భాషల్లో కలిపి రూ. 150 కోట్లు కలెక్ట్ చేసిందని కన్నడ సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కన్నడతో పాటు దేశ వ్యాప్తంగా ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ పేరు మారు మ్రోగితోంది.

దాదాపు కన్నడలో రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. గత నెల 21వ తేదిన విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షనే దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూళు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముందు ముందు కేజీఎఫ్ ఎలాంటి సంచలనాలు నమెదు చేస్తుందో చూడాలి.

నియా శర్మ హాట్ ఫోటోస్

ఇది కూడా చదవండి 

మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన రానా..కథానాయిక ఎవరంటేహంతుకురాలిగా మారిన హన్సిక..ఎందుకో తెలుసా

ఒక్క హిట్ ప్లీజ్.. ఫ్లాపుల్లో మునిగిపోయిన తెలుగు హీరోలు..
First published: January 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు