Home /News /movies /

YASH PRASHANTH NEEL KGF CHAPTER 2 TOTAL WORLD WIDE BOX OFFICE CLOSING COLLECTIONS TA

KGF Chapter 2 Closing Collections : యశ్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్ల లాభం అంటే..

యశ్,ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ క్లోజింగ్ కలెక్షన్స్ (Twitter/Photo)

యశ్,ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ క్లోజింగ్ కలెక్షన్స్ (Twitter/Photo)

KGF Chapter 2 World Wide Box Office Closing Collections : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా  స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2022లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అటు హిందీలో కూడా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 50 రోజుల పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    KGF Chapter 2   : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా  స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్, నార్త్  అనే తేడా లేకుండా మొత్తం భారతీయ  బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఆరో వారంలో కూడా ఇరగదీస్తోంది. ఫస్ట్ వీక్‌లోనే అక్కడ బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ గ్రాస్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. రీసెంట్‌గా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

    కేజీఎఫ్  ఛాప్టర్ 2 సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే  ఈ సినిమా రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులోచేరి ఈ  యేడాది చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బాహుబలి 2  తర్వాత స్థానంలో నిలిచింది.

    ఇక ఈ మూవీ  హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది.   ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో  రికార్డు స్థాయి రూ.  78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 84.25 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తెలుగులో రూ. 5.25 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. రూ. 255.60 కోట్ల లాభాలను రాబట్టింది. కానీ ఏపీలో మాత్రం ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి కాకపోవడం విశేషం. మొత్తంగా ఏ ఏరియాలో  ఎంత రాబట్టిందంటే..

    Nayanthara Wedding : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి ఫోటోలు


    నైజాం (తెలంగాణ):  రూ. 42.93 కోట్లు / రూ. 25కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ.  12.03 కోట్లు  /రూ. 14 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.  7.94 కోట్లు / రూ. 10  కోట్లు
    ఈస్ట్: రూ. 5.59 కోట్లు / రూ. 7 కోట్లు
    వెస్ట్: రూ. 3.66 కోట్లు రూ. 6 కోట్లు
    గుంటూరు: రూ. 4.95 కోట్లు / రూ. 7 కోట్లు
    కృష్ణా: రూ. 4.31 కోట్లు / రూ. 6కోట్లు
    నెల్లూరు:రూ. 2.84 కోట్లు / రూ. 3 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 84.25 కోట్లు షేర్ (రూ. 136.85 కోట్లు గ్రాస్) రాబట్టింది.

    • ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..


    కర్ణాటక : రూ. 106.15 కోట్లు (రూ. 185.70 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు
    తెలుగు : రూ. 84.25 కోట్లు (136.85 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు
    తమిళ్ : రూ.55.50 కోట్లు (రూ. 114.25 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు
    కేరళ : రూ. 32.40 కోట్లు (68.60 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు
    హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 223.50 కోట్లు (రూ. 525 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 100.80 కోట్లు (రూ. 202.60 కోట్లు) / రూ. 30 కోట్లు
    టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 602.60 కోట్లు (రూ. 1233 కోట్ల గ్రాస్) వసూళు చేసింది.

    Nayanthara Wedding :భర్త విఘ్నేష్‌కు నయనతార ఇచ్చిన కట్న కానుకలు ఏంటో తెలుసా..

    మొత్తంగా హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. రూ. 255.60 కోట్ల లాభాలను రాబట్టడమే కాకుండా.. రూ. 255.60 కోట్ల లాభాలను తీసుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: KGF Chapter 2, Prashanth Neel, Sandalwood, Tollywood, Yash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు