Home /News /movies /

YASH PRASHANTH NEEL KGF CHAPTER 2 COLLECTS 400 NET AT HINDI MARKET HERE ARE THE DETAILS SR

KGF Chapter 2 : కెజియఫ్ 2 మరో అరుదైన రికార్డ్.. బాహుబలి 2 తర్వాత రెండో సినిమాగా కెజియఫ్ 2..

కేజిఎఫ్ ఛాప్టర్ 2 మరోొ అరుదైన రికార్డు (KGF Chapter 2 Photo : Twitter)

కేజిఎఫ్ ఛాప్టర్ 2 మరోొ అరుదైన రికార్డు (KGF Chapter 2 Photo : Twitter)

KGF Chapter 2 : భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక తాజాగా మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో ఏకంగా 400 కోట్ల నెట్ వసూళ్ళని అందుకుని బాహుబలి 2 సరసన నిలిచిందని అంటున్నారు.

ఇంకా చదవండి ...
    KGF Chapter 2 Collections | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక తాజాగా మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీలో 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 23 రోజులు పూర్తీ అయ్యే సమయానికి ఏకంగా 400 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని చరిత్రలో ఈ మార్క్ ని అందుకున్న రెండో సినిమాగా నిలిచింది. గతంలో బాహుబలి2 ఒక్క సినిమానే ఈ మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఈ మార్క్ ని అందుకున్న రెండో సినిమాగా కెజియఫ్ నిలిచింది. అంతేకాదు ఈ సినిమా నాలుగో వారం పూర్తి అయ్యేసరికి 450 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

    ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని అందుకున్నట్టుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో ఈ ఏడాదిలో రెండో 1000 కోట్ల సినిమాగా కెజియఫ్ నిలిచింది. అంతేకాదు ఇండియాలో బాహుబలి 2, దంగల్, రౌద్రం రణం రుధిరం చిత్రాల తర్వాత ఆ క్లబ్‌లో చేరిన నాలుగవ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా మొత్తంగా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా.. బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యి.. ఇప్పుడు లాభాల బాటలో నడుస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.


    ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెజియఫ్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. మరో సినిమా కూడా రాబోతుందని టాక్. తాజాగా విడుదలైన కెజియఫ్-2 క్లెమాక్స్‌లో పార్ట్‌-3  (KGF Chapter 3) ఉండబోతుందని హింట్‌ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మూడో భాగంలో రాఖీ భాయ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పవర్‌ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్‌ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్. KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటించారు. KGF 2లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో హిందీ బడా హీరో సంజయ్ దత్‌తో (Sanjay Dutt) అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో (Raveena Tandon) రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు.  క‌న్న‌డ న‌టి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: KGF Chapter 2, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు