Omkar - YashMaster: ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది డాన్సర్లు తమ పర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని కొరియోగ్రాఫర్ గా సెటిల్ అయ్యారు. అంతేకాకుండా ఈ షో ద్వారా పరిచయమైన మరో యంగ్ టాలెంట్ యశ్వంత్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్ గా నిలిచాడు. సినిమాలలో కొరియోగ్రాఫర్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే తన భార్యను నమ్మించి మోసం చేశాడు యష్ మాస్టర్.
రెండేళ్ల కిందట తన చిన్ననాటి స్నేహితురాలు వర్షను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 8 సంవత్సరాల తమ ప్రేమను మొత్తానికి పెళ్లితో మంచి బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఇక వర్ష ఇండిగో ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసేది. ఈమెను కూడా బుల్లితెరలో పరిచయం చేశాడు యష్. పలు షో లలో ఈ జంట గెస్ట్ గా పాల్గొని తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట మరో బుల్లితెర రియాలిటీ షో లో పాల్గొని బాగా రచ్చ చేశారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న రియాలిటీ షో సిక్స్త్ సెన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో జంటగా పాల్గొన్న యష్, వర్ష పాల్గొనగా వీరికి పోటీగా యాంకర్ లాస్య, మంజునాథ్ లు పాల్గొన్నారు. ఇందులో గేమ్ లో భాగంగా ఓంకార్.. వర్షను తను అనుకున్న స్విచ్ వదులుకొని పక్క స్విచ్ క్లిక్ చేయమని అనడంతో.. వెంటనే వర్ష ఈ ఒక్క స్విచ్ తో మీపై నమ్మకం పోకూడదు అని అంటుంది.
View this post on Instagram
ఇక ఓంకార్ చెల్లెమ్మ నీ ఇష్టమని అనేసరికి.. మళ్లీ అదే స్విచ్ నొక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వన్ సెకండ్ అంటూ ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక వర్ష తనకు ఫ్రిజ్ కావాలి అని మారం చేయగా.. పక్కనే ఉన్న తన భర్త యష్.. వేర్ స్విచ్ నొక్కమని సలహా ఇస్తాడు. కానీ వర్ష తన ఓంకార్ అన్న మాటలు నమ్ముకొని.. యష్ చెప్పిన స్విచ్ ను నొక్కడానికి అంగీకరించదు. కానీ యష్ మాత్రం వినిపించుకోకుండా బలవంతం చేయడంతో వర్ష ఏమి చేసేది లేక యష్ చెప్పిన స్విచ్ నొక్కేసరికి అందులో ఓడిపోయింది. దీంతో తన భర్తను నమ్మి మోసపోయిన వర్ష బాధ పడగా వెంటనే యష్ మాట మారుస్తూ నేను ముందే అదే స్విచ్ చెప్పాను కదా అంటూ స్విచ్ మారుస్తూ చూపించగా అక్కడ కాస్త ఫన్నీ క్రియేట్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor omkar, Lasya manjunath, Sixth sense season 4, Star Maa, Yash master