ఆ విషయంలో ప్రభాస్‌ను బీట్ చేసిన కేజీఎఫ్ హీరో యశ్

Prabhas, Yash | కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. విడుదలై నెల రోజులు అవుతోన్న ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతునే ఉంది. తాజాగా ‘కేజీఎఫ్’ సినిమా కర్ణాటకలో మరో అరుదైన రికార్డును నమోదు చేయబోతుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 23, 2019, 8:14 AM IST
ఆ విషయంలో ప్రభాస్‌ను బీట్ చేసిన కేజీఎఫ్ హీరో యశ్
ప్రభాస్, యశ్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. విడుదలై నెల రోజులు అవుతోన్న ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతునే ఉంది. తాజాగా ‘కేజీఎఫ్’ సినిమా కర్ణాటకలో మరో అరుదైన రికార్డును నమోదు చేయబోతుంది.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘కేజీఆఫ్’..హిందీలో రూ.50 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. పీరియాడియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ.25 కోట్ల షేర్ రాబట్టింది.

KGF Star Yash Beats Bahubali Prabhas Records బాహుబలి ప్రభాస్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్ స్టార్ యశ్
కేజియఫ్


ఇప్పటి వరకు కర్ణాటకలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ సినిమా రూ.129 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఇపుడు రికార్డును ‘కేజీఎఫ్’ సినిమా త్వరలో క్రాస్ చేయనుంది. ఇప్పటి వరకు కర్ణాటకలో ‘కేజీఎఫ్’ సినిమా రూ. 129 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అంతేకాదు కన్నడ భాషలో విడుదలైన ఒక సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిన మొదటి సినిమా ‘కేజీఎఫ్’ రికార్డులకు ఎక్కింది. మొత్తానికి రిలీజైన రోజు నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోన్న ‘కేజీఎఫ్’ సినిమా ఇపుడు కర్ణాటకలో ‘బాహుబలి 2’ సెట్స్ చేసిన రికార్డును క్రాస్ చేసింది. ఎఅంతేకాదు  త్వరలో పాకిస్థాన్ దేశంలో కూడా ‘కేజీఎఫ్’ రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. ‘బాహుబలి’ తర్వాత  పాకిస్థాన్‌లో విడుదల కాబోతున్న దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం.

KGF Star Yash Beats Bahubali Prabhas Records బాహుబలి ప్రభాస్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్ స్టార్ యశ్ న్ దండయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుంది. Yash KGF,Yash KGF Release in Pakistan,KGF Release Pakistan,kgf pakistan,yash movies,yash kgf collections,telugu cinema,యశ్,యశ్ కేజియఫ్,కేజియఫ్ కలెక్షన్స్,కన్నడ సినిమా,కేజియఫ్ పాకిస్థాన్,కన్నడ సినిమా
యశ్ ‘KGF’


ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 219.99 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సౌత్‌లో ఈ రికార్డును అందుకున్న ఐదో సినిమా ‘కేజీఎఫ్’ రికార్డులకు ఎక్కింది. త్వరలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అంటూ ఈ సినిమా రెండో భాగం విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌తో పాటు రమ్యకృష్ణ వంటి నటీనటులు నటించే అవకాశాలున్నాయని శాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి దక్షిణాది చిత్రాలు ఉత్తారాదిలో చేస్తోన్న హంగామా చేసి బాలీవుడ్ వర్గాలు ఔరా అంటున్నాయి.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీమ్‌తో క్రిష్ చిట్ చాట్ 

ఇవి కూడా చదవండి 

‘మహానాయకుడు’ వర్సెస్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’..

మహేష్..‘మహర్షి’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

అమ్ముడు పోయిన రాజమౌళి RRR శాటిలైట్ రైట్స్..తెలిస్తే షాక్ అవుతారు..

 

 
First published: January 23, 2019, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading