కేజీఎఫ్2 కొత్త పోస్టర్ విడుదల.. యశ్ అభిమానులకు పండగే..

KGF Chapter 2 : కేజీఎఫ్2 సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను అభిమానుల కోసం అందించింది.

news18-telugu
Updated: January 8, 2020, 11:46 AM IST
కేజీఎఫ్2 కొత్త పోస్టర్ విడుదల.. యశ్ అభిమానులకు పండగే..
కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)
  • Share this:
కేజీఎఫ్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కథలో దమ్ము, హీరో యశ్ నటనతో ఆ సినిమా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనంగా మారింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్2ను చిత్ర యూనిట్ నిర్మిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను అభిమానుల కోసం అందించింది. ఈ మేరకు ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్టర్‌ను విడుదల చేసి, యశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేజీఎఫ్2 కొత్త పోస్టర్


First published: January 8, 2020, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading