Home /News /movies /

YASH AND PRASHANTH NEEL KGF CHAPTER 2 30 DAYS COLLECTIONS SR

KGF Chapter 2 : కెజియఫ్ ముప్పై రోజుల కలెక్షన్స్.. తగ్గేదేలే అంటోన్న రాకీ భాయ్..

KGF Chapter 2 Photo : Twitter

KGF Chapter 2 Photo : Twitter

KGF Chapter 2 Collections : భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టింది. అంతేకాదు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మళ్ళీ మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది.

ఇంకా చదవండి ...
    KGF Chapter 2 Collections | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టింది. అంతేకాదు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మళ్ళీ మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. ఈ సినిమా 30 వ రోజు 6 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.18 కోట్ల షేర్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

    30 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే….
    Karnataka- 102.50Cr
    Telugu States – 83.46Cr
    Tamilnadu – 52.85Cr
    Kerala – 30.55Cr
    Hindi+ROI – 215.70CR~
    Overseas – 95.80CR
    Total WW collection – 580.86CR

    ముప్పై రోజుల గ్రాస్‌ను పరిశిలీస్తే..
    Karnataka- 178.70Cr
    Telugu States – 135.38Cr
    Tamilnadu – 108.90Cr
    Kerala – 64.55Cr
    Hindi+ROI – 505.55CR~
    Overseas – 191.80Cr
    Total WW collection – 1184.88CR

    ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజులు పూర్తీ అయ్యే సమయానికి 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసి.. ఏకంగా 233.86 కోట్ల ప్రాఫిట్‌తో సూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా హిందీలో 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని అందుకున్నట్టుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో ఈ ఏడాదిలో రెండో 1000 కోట్ల సినిమాగా కెజియఫ్ నిలిచింది. అంతేకాదు ఇండియాలో బాహుబలి 2, దంగల్, రౌద్రం రణం రుధిరం చిత్రాల తర్వాత ఆ క్లబ్‌లో చేరిన నాలుగవ సినిమాగా కెజియఫ్ 2 నిలిచిందని అంటున్నారు.

    Ram Pothineni | The Warrior Teaser : ది వారియర్ టీజర్ విడుదల.. పోలీస్‌ లుక్‌లో ఇరగదీసిన రామ్..

    ఇక మూడో భాగంలో రాఖీ భాయ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పవర్‌ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్‌ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్. సంజయ్ దత్‌ (Sanjay Dutt), రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు.  క‌న్న‌డ న‌టి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక కెజియఫ్ చాఫ్టర్ 3 ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే ఈ సినిమా ఉండనుందట.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: KGF Chapter 2, Tollywood news

    తదుపరి వార్తలు