హోమ్ /వార్తలు /సినిమా /

Yami Gautam: ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. ఫ్యాన్స్‌కు మెసేజ్

Yami Gautam: ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. ఫ్యాన్స్‌కు మెసేజ్

తన ఇనస్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ... ఫ్యాన్స్‌కు చెప్పింది యామీ. ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు ఫ్రెండ్స్‌కు హ్యాకింగ్ గురించి సమాచారం అందించింది. దయ చేసిన ఏమైనా ఇనస్టాలో పోస్టులు పెడితే జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

  ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు కొంతమంది సైబర్ నేరగాళ్లు. సెలబ్రిటీల ట్విట్టర్లు, ఫేస్ బుక్, ఇనస్టాలను హ్యా్ చేస్తూ నచ్చిన పోస్టులు పెడుతూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్‌లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని ఆమె ఆరోపించింది.

  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ మెసేజులు, పోస్టులు వస్తే జాగ్రత్తగా ఉండాలని కోరింది. ”నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా అది హ్యాక్ అయి ఉండవచ్చునని అనుకుంటున్నాను. అందుకే మీ అందరికీ తెలియచేస్తున్నాను. వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోపు నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఏదైనా అసాధారణ కార్యకలాపాలు ఉంటే దాని గురించి తెలుసుకొని దయచేసి జాగ్రత్తగా ఉండండి” అంటూ పోస్ట్ చేసింది.

  యామీకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటో షేరింగ్ యాప్‌లో ఆమెకు 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. యామి గౌతమ్ తెలుగులో నువ్విలా సినిమాలో తొలిసారిగా కనిపించింది. గౌరవం, యుద్దం సినిమాల్లో కూడా చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయేసరికి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఆమెకు వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. యామీ నటించిన సనమ్ రే,విక్కీ డోనార్ మంచి హిట్ అయ్యాయి.

  ప్రముఖ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి కాబిల్ సినిమాలో కూడా నటించింది. తాజాగా యామీ నటించిన థర్స్ డే మూవీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక యామీ గౌతమ్ సినిమాల విషయానికొస్తే త్వరలో ఆమె “దాస్వీ”లో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్‌లతో నటి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. యామీ ప్రస్తుతం “దాస్వీ” ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అనిరుద్ధ రాయ్ చౌదరి ‘లాస్ట్’, ‘OMG: ఓ మై గాడ్’ సినిమాల్లో కూడా యామీ బిజీగా ఉంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Hacking, Social Media, Yami Gautam, Yami gautam marriage

  ఉత్తమ కథలు