సాయి పల్లవి సినిమాపై తప్పుడు ప్రచారం.. దర్శకుడు క్లారిటీ..

సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలతో బిజీ అయిపోతుంది. పడిపడి లేచే మనసు తర్వాత మరే సినిమా అంత త్వరగా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 16, 2019, 8:04 AM IST
సాయి పల్లవి సినిమాపై తప్పుడు ప్రచారం.. దర్శకుడు క్లారిటీ..
సాయి పల్లవి (Photo/Twitter)
  • Share this:
సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలతో బిజీ అయిపోతుంది. పడిపడి లేచే మనసు తర్వాత మరే సినిమా అంత త్వరగా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తుంది ఈ ఫిదా బ్యూటీ. ఈ రెండు సినిమాల షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇందులో విరాటపర్వం సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. ఇందులో నక్సలైట్ పాత్రలో నటిస్తుంది ఈ భామ. నీదినాది ఒకే కథ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్ర విషయంలో చాలా వివాదాలు వస్తున్నాయి.

Wrong news circulating on Sai Pallavi Virata Rana Daggubati Parvam movie and unit given clarity pk సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలతో బిజీ అయిపోతుంది. పడిపడి లేచే మనసు తర్వాత మరే సినిమా అంత త్వరగా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ.. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi virata parvam leaked,virata parvam leaked scenes,virata parvam first schedule,sai pallavi new movie,rana and sai pallavi act in virata parvam 1992,virata parvam,virata parvam movie,sai pallavi virata parvam,sai pallavi virata parvam movie,sai pallavi movies,virata parvam movie launch,rana daggubati to romance sai pallavi for virata parvam,virata parvam 1992,rana sai pallavi,sai pallavi act in virata parvam 1992,rana sai pallavi movie,sai pallavi venu udugula,virata parvam leaked rana daggupati,sai pallavi rana daggupati,telugu cinema,సాయిపల్లవి,విరాట పర్వం లీక్స్,విరాట పర్వం సాయిపల్లవి లీక్,సైకిల్ ఎక్కిన సాయిపల్లవి,తెలుగు సినిమా,సాయిపల్లవి రానా
విరాట పర్వం సినిమా ఓపెనింగ్


మొదలుకాక ముందే చాలా రోజుల పాటు సెట్స్ పైకి తీసుకురావడానికి వేచి చూడాల్సి వచ్చింది దర్శక నిర్మాతలు. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన కోసమే చాలా రోజుల వరకు షూటింగ్ అనుకున్న సమయానికి మొదలు కాలేదు. డేట్స్ అడ్జస్ట్ కాక.. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు అమెరికా వెళ్లాడు రానా. ఇప్పటి వరకు విరాటపర్వం సెట్‌లో అడుగుపెట్టలేదు ఈ హీరో. మరోవైపు సాయి పల్లవి మాత్రం తన వరకు చాలా భాగం షూట్ పూర్తి చేసింది. అయితే ఈ చిత్ర విషయంలో దర్శకుడు వేణు, సినిమాటోగ్రఫర్ దివాకర్ మణి మధ్య గొడవలు వచ్చాయని.. అందుకే దివాకర్ బయటికి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి.

Wrong news circulating on Sai Pallavi Virata Rana Daggubati Parvam movie and unit given clarity pk సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలతో బిజీ అయిపోతుంది. పడిపడి లేచే మనసు తర్వాత మరే సినిమా అంత త్వరగా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ.. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi virata parvam leaked,virata parvam leaked scenes,virata parvam first schedule,sai pallavi new movie,rana and sai pallavi act in virata parvam 1992,virata parvam,virata parvam movie,sai pallavi virata parvam,sai pallavi virata parvam movie,sai pallavi movies,virata parvam movie launch,rana daggubati to romance sai pallavi for virata parvam,virata parvam 1992,rana sai pallavi,sai pallavi act in virata parvam 1992,rana sai pallavi movie,sai pallavi venu udugula,virata parvam leaked rana daggupati,sai pallavi rana daggupati,telugu cinema,సాయిపల్లవి,విరాట పర్వం లీక్స్,విరాట పర్వం సాయిపల్లవి లీక్,సైకిల్ ఎక్కిన సాయిపల్లవి,తెలుగు సినిమా,సాయిపల్లవి రానా
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)




అయితే దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి సినిమాటోగ్రఫర్ ఇచ్చిన డేట్స్ విరాటపర్వం యూనిట్ సరిగ్గా వాడుకోలేకపోయారు. అదే సమయంలో మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు ఈయన. దాంతో పరస్పర ఒప్పందంతోనే మణి సినిమా నుంచి బయటికి వెళ్లిపోయాడని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక శేఖర్ కమ్ముల సినిమా కూడా వేగంగానే షూట్ జరుపుకుంటుంది. ఇందులో నాగ చైతన్య హీరో. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. మొత్తానికి సాయి పల్లవి సినిమాపై తప్పుడు ప్రచారం జరగడంతో స్వయంగా చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. అన్నట్లు త్వరలోనే రానా ఈ చిత్ర సెట్‌లో అడుగు పెట్టనున్నాడు. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని తెలుస్తుంది.
First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com