WOULD YOU PEOPLE RECOGNIZE WHO IS THIS STAR HEROINE STANDING NEAR THE SEA PK
ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్
సముద్రం దగ్గర అలా అలల మధ్య చూస్తూ నిలబడిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టడం కష్టంగా ఉంది కదా.. ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్.
సముద్రం దగ్గర అలా అలల మధ్య చూస్తూ నిలబడిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టడం కష్టంగా ఉంది కదా.. ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్. ఓ పెద్దింటి కోడలు కూడా. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గానే దూసుకుపోతుంది ఈమె. ఈ మధ్యే వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేసింది. అక్కడ తన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయిన తర్వాత అలా సేదతీరుతూ అలల మధ్య ఫోటో పెట్టింది. ఇప్పటికీ గుర్తు పట్టలేదా.. చీకట్లో అలా చూస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు మన సమంత అక్కినేని.
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
ప్రస్తుతం ఈమె జాను సినిమాతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే జాను షూటింగ్ అయిపోయింది.. ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఇందులో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చిందంటూ తన అనుభవాలను పంచుకుంది స్యామ్. ఈ చిత్ర షూటింగ్ పూర్తైన సందర్భంగానే ప్యాంట్ షర్ట్ వేసుకుని రఫ్ లుక్‌లో దర్శనమిచ్చింది సమంత. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.