హోమ్ /వార్తలు /సినిమా /

పొదుపు దినోత్సవం.. చిరంజీవి పొదుపు పాఠాలు వైరల్..

పొదుపు దినోత్సవం.. చిరంజీవి పొదుపు పాఠాలు వైరల్..

చిరంజీవి (Twitter/Photo)

చిరంజీవి (Twitter/Photo)

పొదుపు అనేది భారతీయుల నరానరాల్లో జీర్ణించుకుపోయింది. రేపటి గురించి ఆలోచించే దార్శనికత మన సంప్రదాయంలోనే ఉంది. తాజాగా పొదుపు గురించి చిరంజీవి తన పాత సినిమాలో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పొదుపు అనేది భారతీయుల నరానరాల్లో జీర్ణించుకుపోయింది. రేపటి గురించి ఆలోచించే దార్శనికత మన సంప్రదాయంలోనే ఉంది. సగటు భారతీయులందరు కూడా నేడేంటి అనే దానికంటే రేపెలా గడుస్తుందనే దానిపైనే ఎక్కువ మధనపడుతుంటారు. ఒక రూపాయిని ఆదా చేయడం అంటే.. ఒక రూపాయిని సంపాదించడమే అని చెప్పాలి. సగటు భారతీయలుకు ఈ సూత్రం బాగా తెలుసు. నేడు అంతర్జాతీయ పొదుపు దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పాత సినిమా ‘కొదమ సింహం’ సినిమాలో పొదుపు గురించి చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక దొంగను పట్టుకోవడంతో 5వేల వరహాలు సంపాదిస్తాడు. దాన్ని ఇది వరకు పొదుపు చేసిన వాటితో కలపమని చెబుతూ పొదపు మంత్రాన్ని ఉపదేశించాడు. కౌబాయ్ సినిమా కాబట్టి చిరంజీవి వరహాలు పొదుపు చేశాడు. ఈ కాంలో రూపాయలు డాలర్లు, రియాల్స్ దీనార్స్ లాంటివి ఖర్చులకు పోను మిగిలితే పొదుపు చేయాలని  ఈ సందర్భంగా అభిమానులు సందేశం ఇచ్చాడు. ఇపుడీ వీడియోను మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

First published:

Tags: Chiranjeevi, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు