World Famous Lover Twitter Review : వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉందంటే..

World Famous Lover Twitter Review : విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలయ్యాయి.

news18-telugu
Updated: February 14, 2020, 7:51 AM IST
World Famous Lover Twitter Review : వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉందంటే..
Twitter
  • Share this:
World Famous Lover Twitter Review : విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలయ్యాయి. మరీ ఈ సినిమాను అక్కడ చూసిన సినీ ప్రేక్షకులు సినిమా గురించి ఏమంటున్నారో చూద్దాం..  విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. ఓనమాలు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. విజయ్ దేవరకొండ ఇక తన స్టైల్లో ఇటూ యాక్టింగ్‌లోను అటూ విడుదలకు ముందు నిర్వహించిన ప్రచారం కూడా సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కాగా  యూఎస్‌లో ఈ సినిమా ప్రిమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరీ ఈ సినిమా విజయ్‌కు మరో బ్లాక్ బస్టర్ కానుందా.. లేదా యావరేజ్ ఫిల్మ్‌గా నిలవనుందా.. చూసిన వాళ్లు ఏమంటున్నారో చూద్దాం..


ఈ సినిమా గురించి కొంతమంది ఫస్టాఫ్ అదిరిపోయిందని అంటుంటే.. పర్వాలేదని కొందరు అంటున్నారు. ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. విజయ్‌కు తోడుగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని అంటున్నారు. ఈ సినిమాకు సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ  నిర్మించాడు.









Published by: Suresh Rachamalla
First published: February 14, 2020, 7:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading