రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్.. సింగరేణి శీనయ్య మాత్రమే అదిరాడు..

మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి క్లీన్ సినిమా చేసిన క్రాంతి మాధవ్.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ పక్కా ప్రేమకథతో వచ్చాడు. ప్రేమలో కొత్తదనం అంటూ వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంది.. ఆడియన్స్ నిజంగానే వరల్డ్ ఫేమస్ లవర్ నచ్చిందా లేదా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2020, 1:59 PM IST
రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్.. సింగరేణి శీనయ్య మాత్రమే అదిరాడు..
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ (world famous lover review)
  • Share this:
నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, క్యాథెరిన్ థ్రెసా, ఇసబెల్లా..
సంగీతం : గోపిసుందర్
సినిమాటోగ్రఫర్ : జయకృష్ణ గుమ్మడి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : కె.ఎ.వల్లభ
దర్శకత్వం : క్రాంతి మాధవ్మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి క్లీన్ సినిమా చేసిన క్రాంతి మాధవ్.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ పక్కా ప్రేమకథతో వచ్చాడు. ప్రేమలో కొత్తదనం అంటూ వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంది.. ఆడియన్స్ నిజంగానే వరల్డ్ ఫేమస్ లవర్ నచ్చిందా లేదా..కథ:
గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని(రాశీ ఖన్నా) ఇద్దరూ కాలేజ్ నుంచే ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే యామిని వాళ్ల నాన్న ఒప్పుకోడు. దాంతో సహజీవనం చేస్తుంటారు. అయితే రైటర్ కావాలనుకున్న గౌతమ్.. జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటాడు. దాంతో గౌతమ్, యామిని మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. దాంతో గొడవలు షురూ అవుతాయి. అందుకే గౌతమ్‌ను వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది యామిని. అయినా కూడా తను ప్రేమించిన యామిని కోసం పిచ్చోడిగా మారిపోతాడు గౌతమ్. ఆమె కోసమే చూస్తుంటాడు. మరి గౌతమ్, యామిని మధ్య శీనయ్య(సింగరేణి విజయ్), సువర్ణ (ఐశ్వర్య రాజేష్) ఎందుకొచ్చారు.. పారిస్ నుంచి ఇస (ఇసబెల్లా) ఎందుకొచ్చింది అనేది అసలు కథ..

కథనం:
క్రాంతి మాధవ్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుసు.. విజయ్ దేవరకొండ సినిమా అంటే ఎలా ఉంటుందో ఐడియా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసారు. దారులు వేరైనా కూడా విజయ్ దారిలోకే క్రాంతి వచ్చాడు. పూర్తిగా విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు సరిపోయేలా కథ రాసుకున్నాడు. మరోసారి ప్రేమను దూరం చేసుకున్న పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. విరహ వేదనలో పడే బాధను చూపించాడు. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ చెప్పేసాడు దర్శకుడు క్రాంతి. ఆ తర్వాత సింగరేణి ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడ్నుంచి అసలు కథ షురూ అవుతుంది. ముఖ్యంగా శీనయ్య పాత్రలో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు. సింగరేణి బొగ్గు గనుల్లో ఎలా ఉంటారో.. అలాగే స్టడీ చేసాడు విజయ్. ఇక ఆయన భార్య సువర్ణగా ఐశ్వర్య రాజేష్ కూడా అదరగొట్టింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం. ఆ ఎపిసోడ్ ఉన్నంత సేపు సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత పారిస్ ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెడుతుంది. ఇసబెల్లా ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లేలో లోపాలు ఉండటం.. స్లో నెరేషన్ సినిమాకు మైనస్ అవుతుంది. క్రాంతి మాధవ్ ఎమోషనల్ కథను తీసుకున్నా కూడా తీసిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ బాగున్నా.. సెకండాఫ్ మాత్రం చాలా వరకు సాగదీసారు. దాంతో కథ గాడి తప్పింది. అనుకున్న ఎమోషన్ డ్రామా కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయాడు దర్శకుడు క్రాంతి మాధవ్. దాంతో ప్రేమ సన్నివేశాలు కూడా బోర్ అనిపించాయి. శీనయ్య, సువర్ణ కారెక్టర్స్ మినహా మిగిలిన పాత్రలు అంతగా పేలలేదు.. ఓవరాల్‌గా వరల్డ్ ఫేమస్ లవర్ శీనయ్య కథే కానీ పూర్తిగా మాత్రం కాదు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ ఎంత మంచి నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. మరోసారి ఇప్పుడు ఇదే చేసాడు ఈయన. గౌతమ్ పాత్ర ఈజీనే కానీ శీనయ్య లాంటి పాత్ర చేయడం మాత్రం అద్భుతమే. అందులో విజయ్ ఒదిగిన తీరు అమోఘం. డైలాగ్ డెలవరీ.. మాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. సువర్ణ పాత్రలో ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతంగా నటించింది. సింగరేణిలో గృహిణి ఎలా ఉంటుందో అలా కళ్లకు కట్టినట్టు చూపించింది. రాశీ ఖన్నా చాలా బాగా నటించింది. చాలా రోజుల తర్వాత నటిగా ఈమెకు చాలా మంచి పాత్ర వచ్చింది. కేథరిన్ పర్లేదు. ఇసబిల్లా కూడా ఓకే.

టెక్నికల్ టీం:
గోపి సుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు.. పాటలు ఆకట్టుకోలేదు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను.. ముఖ్యంగా సింగరేణి విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది కానీ సెకండాఫ్ ఫోకస్ చేయాల్సింది. దర్శకుడు క్రాంతి మాధవ్ తీసుకున్న లైన్ బాగున్నా.. తీసిన విధానం ఆకట్టుకోలేదు. ఆ స్టోరీ లైన్‌కి తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. సింగరేణి ఎపిసోడ్ ఇంకాస్త ఉన్నా కూడా బాగుండేదేమో అనిపించింది.

చివరగా ఒక్కమాట:
వరల్డ్ ఫేమస్ లవర్.. టైటిల్‌కు మాత్రమే..

రేటింగ్: 2.5/5
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు