news18-telugu
Updated: February 13, 2020, 1:14 PM IST
విజయ్ దేవరకొండ (Source: Twitter)
‘పెళ్లిచూపులు’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కే.యస్.రామారావు సమర్పణలో వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్,కేథరిన్, ఇసబెల్ల లైట్ హీరోయిన్స్‌గా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి విషయమై స్పందించాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని తెలిపాడు. పెళ్లిపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఇప్పటికిపుడు వివాహాం చేసుకోలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నేను నా కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయన్నారు. అందుకే నా మదిలో మ్యారేజ్ అన్న పదాన్నే ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. మొత్తానికి వెండితెర అర్జున్ రెడ్డి తను పెళ్లి పీఠాలు ఎక్కడానికి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
February 13, 2020, 1:14 PM IST