World Famous Lover First Day Collections : వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే కలెక్షన్స్..

World Famous Lover First Day Collections : విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 15, 2020, 11:28 AM IST
World Famous Lover First Day Collections : వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే కలెక్షన్స్..
Twitter
  • Share this:
World Famous Lover First Day Collections : విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. ఓనమాలు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. విజయ్ దేవరకొండ తన శైలిలో విడుదలకు ముందు నిర్వహించిన ప్రచారం కూడా సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం  ప్రపంచవ్యాప్తంగా విడుదలైవ్వగా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం.. ప్రేమికుల రోజున విడుదలైన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టిందనే చెప్పాలి. ప్రచారం అదిరిపోవడంతో టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్లు అదిరిపోయాయి.

World Famous Lover First Day Collections,World Famous Lover Twitter Review,world famous lover,world famous lover trailer,world famous lover review,world famous lover movie,world famous lover teaser,world famous lover public talk,world famous lover songs,world famous lover public review,world famous lover trailer review,world famous lover public response,world famous lover trailer reaction,vijay deverakonda world famous lover,world famous lover movie public talk,విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్,వరల్డ్ ఫేమస్ లవర్,
Twitter


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్‌డే రూ.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడుపోయాయి. చూడాలి మరీ ఈ సినిమా ముందు ముందు ఈ మిక్స్‌డ్ టాక్ నుండి బయటపడి పుంజుకుంటుందా.. లేదా నష్టాలను మూటగట్టుకోనుందా.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు గోపి సుందర్ సంగీతం సమకూర్చాడు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ  నిర్మించాడు.
Published by: Suresh Rachamalla
First published: February 15, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading