హోమ్ /వార్తలు /సినిమా /

SIMBU:35కేజీలు తగ్గడానికి తమిళ హీరో శింబు పడ్డ కష్టం మాటల్లో చెప్పలేం

SIMBU:35కేజీలు తగ్గడానికి తమిళ హీరో శింబు పడ్డ కష్టం మాటల్లో చెప్పలేం

Simbu: తమిళ హీరో శింబు మళ్లీ వార్తల్లో నిలిచాడు. రీసెంట్‌గా హీరోయన్‌ నిధి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డాడు, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నడనే వార్తలతో పాటు సన్నగా అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Simbu: తమిళ హీరో శింబు మళ్లీ వార్తల్లో నిలిచాడు. రీసెంట్‌గా హీరోయన్‌ నిధి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డాడు, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నడనే వార్తలతో పాటు సన్నగా అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Simbu: తమిళ హీరో శింబు మళ్లీ వార్తల్లో నిలిచాడు. రీసెంట్‌గా హీరోయన్‌ నిధి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డాడు, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నడనే వార్తలతో పాటు సన్నగా అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తమిళ స్టార్ హీరో శింబుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఫోటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వీడియో తాలుకు విశేషం ఏమిటంటే సిలంబరసన్‌(Silambarasan)గా పిలుచుకునే శింబు (simbu)డ్రమ్ములా ఉండే వాడు ఒక్కసారిగా కరెంట్‌ తీగలా సన్నగా అయిపోయాడు. ఇందుకోసం శింబు ఏం చేశాడు..ఎంత కష్టపడ్డాడో చూపించే వీడయోనే ద జర్నీ ఆఫ్ ఆత్మన్(The Journey of atman). శింబు దాదాపు చాలా రోజుల నుంచి సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించకుండా పోయాడు. మధ్యలో కరోనా ప్రభావంతో విశ్రాంతి తీసుకోవడంతో 39సంవత్సరాల ఈ హీరో 110 కేజీల బరువు(110 Kgs we) పెరిగాడు. ప్రేమ నాశనం కాదు అనే మూవీతో నటుడిగా పరిచయమైన శింబు ఆ తర్వాత రెండేళ్లకు మన్మధన్‌ manmadhanమూవీతో డైరెక్టర్‌గా మారి సక్సెస్ కొట్టాడు. తండ్రి టి.రాజేందర్‌(T Rajendar)లాగానే మల్టీ టాలెంట్‌ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నాడు శింబు. అలాంటి హీరోకి నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్నాయి. కాల్‌షీట్లు ఇవ్వకపోవడం, షూటింగ్‌ టైమ్‌కి రాకపోవడం వంటి సమస్యలతో శింబు చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరగా రాజావ థాన్‌ వరువేన్‌ సినిమాలో ఒక్కసారిగా బరువు పెరగడంతో అతనిపై విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. అంతా అతని కెరియర్‌ ముగిసిపోయిందని భావిస్తున్న సమయంలో తనకు తానుగా పూర్తిగా మార్చుకొని సన్నగా మారాడు శింబు. రోజుకు నాలుగు బిర్యానీలు తినే శింబు ఎవరూ గుర్తు పట్టలేనంత లావుగా తయారైపోయాడు. దాంతో అతనితో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు అంతగా ఆసక్తిచూపలేదు. అతని శరీరం సహాకరించలేదు.

డ్రమ్ములా ఉండేవాడు తీగలా మారాడు..

ఇండస్ట్రీలో ఇక శింబు పని అయిపోయిందనుకున్న సమయంలో తన శరీరాన్ని ఎలాగైనా మాములుగా మలచుకోవాలని కసరత్తు మొదలుపెట్టాడు. అందుకోసం తెల్లవారు జామునే 4.30గంటలకు నిద్రలేచి రోజుకు సుమారు 8గంటలకు పాదాలపై నడిచేవాడు. రోజుకు నాలుగు బిర్యానీలు తినే శింబు కంప్లీట్‌గా వెజిటేరియన్‌గా మారిపోయాడు. తాను అలా కావడానికి తీసుకున్న శ్రద్ధ, చేసిన ఎక్స్‌ర్‌సైజ్‌ల వీడియోని కలిపి ద జర్నీ ఆఫ్‌ ఆత్మన్‌ అని పుట్టిన రోజున వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు శింబు.


హాట్సాఫ్ శింబు..

శరీరం బరువు తగ్గించుకోవడం చేసిన ఫిట్‌నెస్‌ వర్కవుట్స్‌కి సంబంధించి మొదటి రోజు శింబు 105 కేజీల బరువు ఉంటే..రీసెంట్‌గా 72కేజీలకు తగ్గినట్లుగా అతని ఫిట్‌నెస్ ట్రైనర్ వీడియోలో షేర్ చేశాడు. ఇందుకోసం వాకింగ్‌తో పాటు జాగింగ్, రన్నింగ్, జిమ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటెన్, క్రికెట్‌, హార్స్‌ రైడింగ్ ఒకటేంటి..అన్నీ రకాలుగా శరీరాన్ని కష్టపెట్టి కరిగించాడని ఫిట్‌నెస్ ట్రైనర్‌ ఓ ఇంటర్వూలో తెలిపాడు. శింబు తన శరీరాన్ని సన్నగా మార్చుకోక ముందు దిగిన ఫోటోతో పాటు ప్రస్తుతం ఫిట్‌నెస్‌తో ఉన్న ఫోటోని కలిపి షేర్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. హిందీలో దంగల్ సినిమా కోసం అమీర్‌ఖాన్‌ ఒళ్లు పెంచితే..శింబు సినిమా కోసం సన్నబడ్డాడని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

First published:

Tags: Tamil, Viral Video

ఉత్తమ కథలు