జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది షో రీఎంట్రీ అదిరిపోయింది. లాక్ డౌన్ తర్వాత అదిరింది షో కూడా ఫ్రెష్ ఎపిసోడ్స్ తో ముందుకు వచ్చేసింది. అయితే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో చమ్మక్ చంద్ర ముసలి గెటప్ లో చేసిన సందడి తెగ ఆకట్టకుకుంది. అందులో ఎప్పటి మాదిరిగానే చమ్మకచంద్ర తన మార్కు పంచులతో రెచ్చిపోయాడు. అలాగైతే ఎలా మరి అంటూ చంద్ర వేసిన పంచులు నేరుగా నవదీప్, అలాగే యాంకర్ రవి, భానులను సైతం వదల్లేదు. నవదీప్ అయితే చంద్ర పంచులకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే బూతు ధ్వనించే ఈ పంచులకు జడ్జి స్థానంలో ఉన్న నాగబాబు సైతం స్పందిచడం అంతేకాదు ఎలా మరి అంటూ వంత పాడటంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు తరచూ యూ ట్యూబ్ వేదికగా నీతులు చెబుతుంటారని, అయితే అవి పాటించడంలో మాత్రం ఆయన ఎందుకు వెనుక బడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా జబర్దస్త్ తో పోటీ పడేందుకు అదిరింది షోలో వల్గర్ జోక్స్ శాతం ఎక్కువ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మరో జడ్జి నవదీప్ అలాంటి జోక్స్ కు బూతు కామెంట్రీ ఇస్తూ ప్రోత్సహించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి అదిరింది షో కూడా ప్రేక్షకుల అటెన్షన్ పొందుతోంది. అందుకు యూట్యూబ్ లో ఆ షోలోని స్కిట్స్ కు వస్తున్న వ్యూస్ ద్వారా తెలుస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.