బిచ్చగత్తెకు బాలీవుడ్‌లో బంపరాఫర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సాధారణంగా మనందరం రైల్లలో ప్రయాణిస్తుంటే.. చాలా మంది ఏవో కొన్ని పాటలు పాడి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు.

news18-telugu
Updated: August 24, 2019, 7:53 PM IST
బిచ్చగత్తెకు బాలీవుడ్‌లో బంపరాఫర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
పాట పాడుతున్న బిచ్చగత్తే
  • Share this:
సాధారణంగా మనందరం రైల్లలో ప్రయాణిస్తుంటే.. చాలా మంది ఏవో కొన్ని పాటలు పాడి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. వారిలో కొందరు మాత్రం ఎంతో లయ బద్దంగా పాటలు పాడుతుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని రణాఘాట్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్లో ఏదో పాటలు పాడుకుని నాలుగు డబ్బులు వెనకేసుకునే ఒక  బిచ్చగత్త రోజు ఆ ట్రైన్‌లో లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ పాటలను పాడతూ అడుక్కుంటూ ఉండేది.తాజాగా ఈమె లతాజీ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’  పాట పాడుతూ అందరినీ తన్మయాత్వానికి గురిచేసింది. ఆమె ఏదో పాట పాడి నాలుగు డబ్బులు అడుక్కొని కుటుంబాన్ని పోషించాలనుకుంది. రోజు ఆ రూట్లో తిరిగేవారిందరికి ఆమె పాటలు పరిచయమే. అలా లతాజీ పాట పాడుతున్న ఆమెను ఒక నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

View this post on Instagram
 

Remember the lady singing Lata song outside Kolkatta railway station. Today she recorded her first single with #himeshreshammiya for a movie 👍. Awesome happy for her #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on

ఆ వీడియో కాస్తా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా చూశాడు. అంతేకాదు వెంటనే ఆమె ఎక్కుడుంటుందో కనుక్కొని.. ఎలాగైతేనేం ఆమెను పట్టుకున్నాడు. అంతేకాదు తాను కంపోజ్ చేస్తున్న ఒక సినిమాలో పాట పాడమని ఆఫర్ కూడా చేసాడు. దీనికి ఆమె సరేనడంతో ఆమెతో ఒక డ్యూయట్ పాడించాడు. అంతేకాదు ఆ పాటను  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఇపుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు