హోమ్ /వార్తలు /సినిమా /

#HBDSamantha: విజయాలను ఇలానే కొనసాగించాలని..శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

#HBDSamantha: విజయాలను ఇలానే కొనసాగించాలని..శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

సమంత అక్కినేని.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా వెలుగుతున్నారు. ఆమె తాజా సినిమా 'మజిలీ' బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. అయితే ఈ రోజు సమంత పుట్టిన రోజును జరుపుకుంటోంది..ఈ సందర్బంగా గతంలో ఆమె చేసిన సినిమాలు..పాత్రల తీరులను చూద్దాం..

ఇంకా చదవండి ...

  సమంత అక్కినేని.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా వెలుగుతున్నారు. ఆమె తాజా సినిమా 'మజిలీ' బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. అంతేకాదు..ఆమె నటించిన తమిళ సినిమా 'సూపర్ డీలక్స్' కూడా అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఏడాది రెండు ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకుంది సమంత. ఈ రోజు సమంత పుట్టిన రోజును జరుపుకుంటోంది.  ఈ సందర్బంగా సమంత గతంలో చేసి ఘన విజయాలు అందుకున్న సినిమాలు, ఆమె పాత్రల తీరును చూద్దాం..సమంత మొదటి తెలుగు సినిమా..నాగచైతన్యతో ఏ మాయ చేశావే’ చేసింది. ఈ సినిమాలో జెస్సీ..గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కంటుకుంది. ముఖ్యంగా కుర్రకారు జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.

  సమంత, నాగచైతన్య Photo: Instagram

  ఆ సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందు..గా చేసింది. తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా.. నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘ఈగ’లో ప్రేమికుడిని కొల్పోయి, ఈగ సహాయంతో పగ తీర్చుకున్న ప్రియురాలు బిందుగా.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో మరదలు శశిగా.., అక్కినేని కుంటుంబం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో ప్రియగా.. ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణిగా.. సుకుమార్, చరణ్ కాంబీనేషన్‌లో వచ్చిన రంగస్థలంలో పల్లేటూరి పిల్ల రామలక్ష్మిగా.., తాజగా ‘మజిలీ’లో భాద్యతనేరిగిన భార్య శ్రావణిగా.. ఇలా ప్రతి సినిమాలో ఆమె.. తన పాత్రలతో అదరగొడుతూ..తెలుగు ప్రేక్షుకుల్లో ఓ తీయని తీపి గుర్తుగా ఉండిపోయింది.

  Samantha Akkineni Interesting Comments on her Collage days and Odd Jobs for Pocket money pk.. ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. ఎవ‌రికైనా డ‌బ్బే కావాలి. అది ఎవ‌రికైనా కూడా.. ఇప్పుడు స‌మంత కూడా త‌న‌కు జీవితంలో ఎదురైన కొన్ని వింత సంఘ‌ట‌న‌ల గురించి చెప్పింది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot photos,samantha akkineni odd jobs,samantha akkineni collage days,samantha akkineni pocket money,samantha akkineni hot videos,samantha akkineni majili movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని మజిలీ,సమంత అక్కినేని కాలేజ్ డేస్,సమంత అక్కినేని పాకెట్ మనీ,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
  సమంత అక్కినేని ఫైల్ ఫోటో

  నేడు సమంత 31 ఏళ్లు పూర్తి చేసుకుని 32వ వసంతంలోకి అడుగుపెడుతుంది. పోయిన సంవత్సరం లాగే.. ఈ ఏడాది కూడా ఆమెకు అంత మంచి జరగాలనీ, మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవాలనీ కోరుకుంటూ..హ్యాపీ బర్త్ డే సమంత. పుట్టిన రోజు సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలిపారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Naga Chaitanya Akkineni, Samantha, Tamil Film News, Telugu Cinema News

  ఉత్తమ కథలు