Home /News /movies /

WILL YSRCP MLA ACTRESS ROJA EFFECT ON JABARDASTH AND EXTRA JABARDASTH IN A BIG WAY AK

Jabardasth: జబర్ధస్త్‌పై ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడిందా ?.. ఆమె లేకపోవడం మైనస్‌గా మారుతోందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jabardasth: కొన్నేళ్ల పాటు నాగబాబు లేకపోయినా.. జబర్ధస్త్ షో సక్సెస్‌ఫుల్ కావడం వెనుక కీలక పాత్ర పోషించిన రోజా.. మంత్రిపదవి దక్కడంతో ఈ షోకు దూరంగా ఉన్నారు.

    బుల్లితెరపై టాప్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న జబర్ధస్త్ రేటింగ్ కొంతకాలంగా తగ్గుముఖం పడుతోందనే టాక్ వినిపిస్తోంది. సుధీర్, గెటప్ శ్రీను వంటి వాళ్లు షో నుంచి వెళ్లిపోవడం.. షోలో హైపర్ ఆది స్కిట్ లేకపోవడం వంటివి ఇందుకు పలు కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే సుధీర్‌కు(Sudigali Sudheer) జబర్ధస్త్‌లో అవమానం జరిగిందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం వెంటనే రంగంలోకి దిగారు జబర్ధస్త్‌లోని ఇతర ఆర్టిస్టులు. జబర్ధస్త్ షో (Jabardasth) నిర్వహించే మల్లెమాల సంస్థ ఎంతో గొప్పదని.. వాళ్లు షోలోని పార్టిసిపెంట్లను చాలా బాగా చూసుకుంటారని హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్.

    అయితే జబర్ధస్త్‌లో మరోసారి ఈస్థాయిలో కుదుపు రావడంతో.. ఈ కార్యక్రమం మళ్లీ ప్రేక్షకులను గతంలో మాదిరిగా ఆకట్టుకుంటుందా ? అనే చర్చ మొదలైంది. అయితే రోజా జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయిన తరువాతే ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి జబర్ధస్త్‌ షో మొదలైనప్పటి నుంచి రోజా ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జబర్ధస్త్‌ షోలో కంటిన్యూ అవుతూ వచ్చారు.



    మధ్యలో జడ్జిగా ఉన్న నాగబాబు మరో ఛానల్‌లోని కామెడీ షోకు వెళ్లిపోవడంతో.. ఆయనతో పాటు కొందరు కమెడియన్లు అటు వైపు వెళ్లిపోవడంతో జబర్ధస్త్ పరిస్థితి ఏమవుతుందో అని చాలామంది భావించారు. కానీ జబర్ధస్త్‌ షోను మాత్రం అదే స్థాయిలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తూ వచ్చింది మల్లెమాల సంస్థ. ఇందుకు రోజా కూడా ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. నాగబాబు వెళ్లిపోయినా.. షోను ముందుకు నడిపించడంతో ఆమె సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది.

    Sai Pallavi: సాయి పల్లవి డేరింగ్ స్టెప్.. ఆలోచనలు పెద్దవే! ఇది ఎవ్వరూ ఉహించి ఉండరు..

    Tollywood Police : చిరు, బాలయ్య సహా సిల్వర్ స్క్రీన్ పై పోలీస్ పవర్ చూపించిన టాలీవుడ్ హీరోలు..

    అలా కొన్నేళ్ల పాటు నాగబాబు లేకపోయినా.. జబర్ధస్త్ షో సక్సెస్‌ఫుల్ కావడం వెనుక కీలక పాత్ర పోషించిన రోజా.. మంత్రిపదవి దక్కడంతో ఈ షోకు దూరంగా ఉన్నారు. ఆమె వెళ్లిపోయిన తరువాత ఆడియెన్స్‌కు ఈ షో మీద కాస్త ఇంట్రస్ట్ తగ్గిందనే చర్చ సాగుతోంది. దీనికి తోడు జబర్ధస్త్ షోలో కీలకంగా ఉన్న సుధీర్ టీమ్‌లోని సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడం.. హైపర్ ఆది జబర్ధస్త్‌లో స్కిట్స్ చేయకపోవడంతో అసలు జబర్ధస్త్ ఎటు వెళ్లిపోతుందనే చర్చ జరుగుతోంది. అనసూయ కూడా షోకు గుడ్ బై చెప్పడంతో.. ఇక జబర్ధస్ షోకు గ్లామర్ టచ్ కూడా పోయిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రోజా జబర్ధస్త్ నుంచి వెళ్లిపోవడంతో సెంటిమెంటల్‌గానూ ఈ షోకు ఏదీ కలిసిరావడం లేదనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jabardasth, Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు