హోమ్ /వార్తలు /సినిమా /

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తించండి చూద్దాం..

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తించండి చూద్దాం..

స్టార్ హీరోయిన్ (Bollywood Super Star)

స్టార్ హీరోయిన్ (Bollywood Super Star)

ఈ ఫోటోలో ఉన్నది ఓ సూపర్ స్టార్. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులను దక్కించుకున్న స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌లో అయితే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు.

ఈ ఫోటోలో ఉన్నది ఓ సూపర్ స్టార్. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులను దక్కించుకున్న స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌లో అయితే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. హిందీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇంకా గుర్తు పట్టలేదు కదా.. ఆమె మరెవరో కాదు కరీనా కపూర్. ప్రస్తుతం పటౌడీ ఖాన్ దాన్ కోడలు. పెళ్లైనా.. త‌ల్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఉంది కరీనా కపూర్. సైఫ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా త‌న ప‌ద్ద‌తి మాత్రం మార్చుకోనంటుంది. ఇప్పటికీ త‌న అందాల బ్లాక్ బ‌స్ట‌ర్ చూపిస్తూనే ఉంది క‌రీనా. ఈమె జోరు చూసి అబ్బో.. అదిరింది గురూ అందాల సోకు అంటున్నారు ఫ్యాన్స్.

కరీనా కపూర్ ఖాన్ (Instagram Photo)
కరీనా కపూర్ ఖాన్ (Instagram Photo)

వయసు 40కి వచ్చినా కూడా ఇప్ప‌టికీ అమ్మాయిగారు ఫిజిక్ విష‌యంలో మాత్రం పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పటికీ అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఔరా అనిపిస్తుంది కరీనా. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూనే ఉంది కరీనా. ఈ మధ్యే అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన గుడ్ న్యూస్ సినిమాలో నటించింది. జిమ్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ఈ ప‌టౌడీ కోడ‌లు. ఇప్ప‌టికీ బికినీలు వేసుకుంటూ కుర్ర హీరోయిన్ల‌ను కూడా ప‌రేషాన్ చేస్తుంది క‌రీనా. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా పేజీలో తన చిన్నప్పటి ఫోటో షేర్ చేసింది కరీనా. కరోనా కారణంగా ఎవరైనా వచ్చి తను షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే.. తాను మాత్రం ఇలా చేయి చూపిస్తానంటూ పోస్ట్ చేసింది కరీనా.

First published:

Tags: Bollywood, Kareena Kapoor

ఉత్తమ కథలు