ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడి కొడుకులు ఇప్పుడు హీరోలు..

చిన్నప్పటి ఫోటోలు అంటే ఒకప్పటి అందమైన జ్ఞాపకాలు. అందులో మనకు మనం చిన్నగా కనిపిస్తుంటే గత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇక్కడ కూడా ఓ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 5:06 PM IST
ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడి కొడుకులు ఇప్పుడు హీరోలు..
టాలీవుడ్ స్టార్ హీరో (Tollywood Star Hero)
  • Share this:
చిన్నప్పటి ఫోటోలు అంటే ఒకప్పటి అందమైన జ్ఞాపకాలు. అందులో మనకు మనం చిన్నగా కనిపిస్తుంటే గత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇక్కడ కూడా ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో కనిపిస్తుంది. ఈయన బాల నటుడిగానే వచ్చి.. ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి పేరు నిలబెట్టడమే కాకుండా.. తన కొడుకులను కూడా హీరోలుగా చేసి.. స్టార్స్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు.

నాగార్జున (nagarjuna)
నాగార్జున (nagarjuna)


ఆయనెవరో కాదు.. మన కింగ్ నాగార్జున. ఈయన చిన్నపుడే తండ్రితో పాటు సినిమాల్లో నటించాడు. 1968లో విడుదలైన సుడిగుండాలు సినిమాలో నాగార్జున చిన్న పాత్రలో నటించాడు. బాల నటుడిగానే వచ్చి.. తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆ సినిమాను ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించాడు. అప్పట్లోనే మరో రెండు మూడు సినిమాలు చేసాడు నాగార్జున. ఆ సినిమాలో విభిన్నమైన గెటప్స్‌లో కనిపించాడు నాగార్జున. ఆ తర్వాత విక్రమ్ సినిమాతో మెయిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా నాగార్జున ప్రయాణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు