చరణ్ సాక్షిగా స్టేజ్‌పై కలిసిన త్రివిక్రమ్, దేవీశ్రీ..మళ్లీ సినిమా ఉంటుందా

పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘జల్సా’ మూవీ నుంచి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌తో ప్రయాణం చేస్తూనే వున్నాడు త్రివిక్రమ్. మధ్యలో మహేశ్‌తో చేసిన ‘ఖలేజా’ సినిమాను పక్కనపెడితే....ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు దేవీశ్రీతో త్రివిక్రమ్ సంగీత ప్రయాణం కొనసాగింది. తాజాగా వీరిద్దిరు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విదేయ రామ’ ఆడియో వేడుకలో కలవడం టాలీవుడ్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: December 28, 2018, 10:35 AM IST
చరణ్ సాక్షిగా స్టేజ్‌పై కలిసిన త్రివిక్రమ్, దేవీశ్రీ..మళ్లీ సినిమా ఉంటుందా
వినయ విధేయ రామ ఆడియో వేడుకలో త్రివిక్రమ్, దేవీశ్రీ ప్రసాద్
  • Share this:
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు గిరాకీ బాగానే ఉంటుంది.  అది హీరో, దర్శకుడు కావచ్చు. లేకుంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వొచ్చు. అటువంటి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల కోసం ఆడియన్స్ కూడా బాగానే వెయిట్ చేస్తారు. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘జల్సా’ మూవీ నుంచి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌తో ప్రయాణం చేస్తూనే వున్నాడు త్రివిక్రమ్. మధ్యలో మహేశ్‌తో చేసిన ‘ఖలేజా’ సినిమాను పక్కనపెడితే....ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు దేవీశ్రీతో త్రివిక్రమ్ సంగీత ప్రయాణం కొనసాగింది.

ఆ తర్వాత ఏమైందో ఏమో..త్రివిక్రమ్, నితిన్‌తో చేసిన ‘‘అ..ఆ’’ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ను కాదని అనిరుథ్ రవిచంద్రన్ కోసం ట్రై చేసారు. కానీ ఫైనల్‌గా ‘అ..ఆ’ మూవీకి మిక్కీ.జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఐతే  సినిమాకు ఉన్న బడ్జెట్ లిమిట్స్‌ వల్లో..లేకపోతే దేవీశ్రీ ప్రసాద్ ఖాళీగా లేకపోవడం వల్లో ఆ సినిమా చేయలేకపోయాడని అందరు అనుకున్నారు.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్


ఆ తర్వాత త్రివిక్రమ్..పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ మూవీకి కూడా దేవీశ్రీప్రసాద్‌ను కాదని..అనిరుథ్ రవిచంద్రన్‌తో మ్యూజిక్ చేయించుకున్నాడు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీకి ముందుగా అనిరుథ్‌ను అనుకున్నా...ఫైనల్‌గా తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. వరుసగా మూడు సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్‌ని వద్దనుకున్నాడంటే ఇద్దరి మధ్య ఏమైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా అని ఫిల్మ్ నగర్ వర్గాలు డౌట్ పడ్డాయి.

"అర‌వింద స‌మేత" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వీరరాఘ‌వుడి ఊచకోత.. aravinda sametha veera raghava 1st day total ww collections..
అరవింద సమేత వీరరాఘవ మూవీలో స్లిల్


కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న త్రివిక్రమ్, దేవీశ్రీప్రసాద్‌లు రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతేకాదు ఈ వేదికపై చిరుతో త్రివిక్రమ్ సినిమా అఫీషియల్‌గా కన్ఫామ్ అయింది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్‌పై కలుసుకున్న త్రివిక్రమ్, దేవీశ్రీ ప్రసాద్‌లు మెగాస్టార్ మూవీ కోసం మరోసారి చేతులు కలుపుతారో ఏమో వెయిట్ అండ్ సీ.

ఇది కూడా చదవండి ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమా షురూ

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి రెండవ కూతురు ఖుషి

వినయ విధేయ రాముడి సాక్షిగా చిరంజీవి-త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్..
First published: December 28, 2018, 9:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading