బాలకృష్ణ విరాళం ఇవ్వకపోవడానికి కారణం ఆ హీరోనా..?

Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఏ విపత్తు వచ్చినా కూడా ముందుండే హీరో బాలయ్య. తన బసవతారకం హాస్పిటల్లో డబ్బులు లేవని వచ్చిన ఎంతోమంది ఉచితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుంటాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 1, 2020, 11:00 PM IST
బాలకృష్ణ విరాళం ఇవ్వకపోవడానికి కారణం ఆ హీరోనా..?
బాలకృష్ణ న్యూ లుక్ (balakrishna new look)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఏ విపత్తు వచ్చినా కూడా ముందుండే హీరో బాలయ్య. తన బసవతారకం హాస్పిటల్లో డబ్బులు లేవని వచ్చిన ఎంతోమంది ఉచితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుంటాడు ఈయన. రాజకీయ నాయకుడిగా కూడా తనకు కావాల్సిన వాళ్లను ప్రాణంగా చూసుకుంటాడు బాలయ్య. ఇంత మంచి పేరు ఉన్న ఈయన.. ఎందుకో తెలియదు కానీ ఒక్క విషయంలో మాత్రం స్పందించడం లేదు. అదే కరోనా బాధితులకు సహాయం.. సినిమా కార్మాకులకు విరాళం. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలతో పాటు చిన్నచిన్న వాళ్లు కూడా తమకు తోచిన విరాళం అందించారు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)


నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్లు కోటి రూపాయలు ఇచ్చారు. అయితే బాలయ్య మాత్రం ముందుకు రావడం లేదు. దానికి ప్రత్యేకంగా కారణాలున్నాయా అని ఆరా కూడా తీస్తున్నారు అభిమానులు. అయితే బాలయ్య స్పందించకపోవడం వెనక ఏం పెద్దగా కారణాలు కూడా కనిపించడం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా కచ్చితంగా విరాళం ఇస్తాడంటున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం మరో కథ వినిపిస్తుంది. బాలకృష్ణ విరాళం ప్రకటించకపోవడానికి కారణం చిరంజీవి అనే రూమర్స్ వస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)


దాని వెనక ఓ కథ వినిపిస్తుంది. తెలుగు సినిమా కార్మికుల కోసం పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి ప్రెసిడెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఇది బాలయ్యకు నచ్చడం లేదని ఓ వర్గం చేస్తున్న ప్రచారం. చిరంజీవి ఉన్నాడు కాబట్టే బాలయ్య ఇప్పటి వరకు విరాళం ప్రకటించలేదని వాళ్లు చెబుతున్న మాట. అందులో నిజానిజాలు పక్కన బెడితే తమ హీరో అలాంటి వాడేం కాదంటున్నారు బాలయ్య అభిమానులు. చిరంజీవి ఉన్నంత మాత్రాన ఆయన విరాళం ప్రకటించలేదని చెప్పడం సబబు కాదంటున్నారు వాళ్లు.

బాలయ్య న్యూ లుక్ (balakrishna new look)
బాలయ్య న్యూ లుక్ (balakrishna new look)


కచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఓ రోజు బాలయ్య కూడా భారీ విరాళం అందిస్తాడు.. కార్మికులకు అండగా నిలబడతాడని చెబుతున్నారు ఫ్యాన్స్. మరోవైపు చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లందర్నీ కచ్చితంగా ముందుకొచ్చి సాయం చేయాలని ట్వీట్స్ చేస్తున్నాడు. ఈ విషయంలో బాలయ్య నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: April 1, 2020, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading