ఓ స్టార్ హీరోయిన్ తమ సినిమాలో నటిస్తుందేమోనని మన టాలీవుడ్‌లోని స్టార్స్ అందరూ ట్రై చేశారు. కానీ ఆమె సింపుల్‌గా నో చెప్పేసింది. కానీ ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ట్రై చేస్తున్నాడు. మరి పెద్ద స్టార్స్ సినిమాలనే పట్టించుకోని సదరు హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్‌ను పట్టించుకుంటుందా? అని టాక్ వినిపిస్తోంది. ఇంతకూ బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాలో నటింప చేయాలని ట్రై చేస్తున్న హీరోయిన్ ఎవరో కాదు.. జాన్వీ కపూర్. దక్షిణాది హీరోయిన్ శ్రీదేవి తనయ అయిన జాన్వీ కపూర్ కోసం మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేసిన వర్కవుట్ కాలేదు.
మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఏ సినిమాలో జాన్వీకపూర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసా? వివరాల్లోకి వెళితే.. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కోసం నిర్మాతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.
తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పెన్ స్టూడియో బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.