WILL THALAPATHY VIJAY FATHER SA CHANDRASEKHAR JOINING IN BJP AND HERE THE BEHIND STORY PK
Vijay father Chandrasekar: బీజేపీలోకి సూపర్ స్టార్ తండ్రి.. తమిళ రాజకీయాల్లో సంచలనం..?
విజయ్ చంద్రశేఖర్ (Vijay Chandrasekhar)
Vijay father Chandrasekar: తమిళనాడులో బీజేపీ తన సత్తా చూపించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో వాళ్ల కోరిక నెరవేరడం లేదు. అందుకే మధ్యలో రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్..
తమిళనాడులో బీజేపీ తన సత్తా చూపించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో వాళ్ల కోరిక నెరవేరడం లేదు. అందుకే మధ్యలో రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ వైపు కూడా వాళ్ల అడుగులు పడ్డాయి. రజినీని మచ్చిక చేసుకుని తమ పార్టీ వైపు తిప్పుకోవాలని కూడా చూసారు కమలనాథులు. ఈ క్రమంలోనే అప్పట్లో నరేంద్ర మోడీ తమిళనాడు వచ్చినపుడు స్వయంగా రజినీకాంత్ ఇంటికి వెళ్లి కలిసారు. కానీ సూపర్ స్టార్ మాత్రం దానికి నో చెప్పాడు. కావాలంటే స్నేహంగా ఉంటాను కానీ పార్టీలో మాత్రం చేరనంటూ తెగేసి చెప్పేసాడు సూపర్ స్టార్. దాంతో ఇతర హీరోల వైపు కూడా బీజేపీ అడుగులు పడ్డాయి. అందులో విజయ్ కూడా ఉన్నాడు. ఆయన్ని కూడా చాలా ఏళ్లుగా బీజేపీ తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంది.. కానీ ఆ తర్వాత అతడిపై కొన్ని కక్ష్య సాధింపు చర్యలు కూడా చేపట్టినట్లు ప్రచారం జరిగింది.
దళపతి విజయ్ (Thalapathy Vijay)
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ గెలుపు వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తమిళ సినీ ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సినిమా వాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ పార్టీ. ఈ క్రమంలోనే గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ లాంటి వాళ్లకు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు తెలుస్తుంది.
విజయ్ చంద్రశేఖర్ (Vijay Chandrasekhar)
మరోవైపు సూపర్ స్టార్ విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత చంద్రశేఖర్ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన బీజేపీలో చేరనున్నాడని ఓ వర్గం నుంచి వస్తున్న సమాచారం. ఈయన ఇప్పటికే కమలం నుంచి పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నాడని చాలా వార్తలే వినిపిస్తున్నాయి. దీనిపై చంద్రశేఖర్ కూడా వెంటనే క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లే ఉద్ధేశ్యమే లేదని.. బీజేపీలో కూడా చేరలేదని చెప్పాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.